దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఓ వైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు బయటికి వెళ్లి పోతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏమాత్రం ధైర్యం తగ్గటం లేదు.
ఇప్పటికే రెండు సార్లు గెలిచినా మమత వరుసగా మూడోసారి గెలిచి బెంగాల్లో హ్యాట్రిక్ సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు.అనేక సమీకరణలు మమత గెలుపునకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నట్టు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు ప్రతిపక్షాల మధ్య చీలితే మమత గెలుపు సులువు అవుతుందని అంచనా.
పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 సీట్లు ఉన్నాయి.148 సీట్లు మ్యాజిక్ ఫిగర్.దీనిని సాధించడం బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనంటున్నారు.
ఉత్తర భారతంలో వ్యవసాయ చట్టాల వల్ల బీజేపీని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇక పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇతర నిత్యావసరాల వస్తువుల పెరుగుదల వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది.
దీంతో బీజేపీకి అనుకున్న స్థాయిలో ఓట్లు పడే అవకాశం లేదట.

ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులు కనీసం 50 నుంచి 60 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని భావిస్తున్నారు.అక్కడ బీజేపీకి పడే ఓట్లు ఈ రెండు పార్టీలు చీల్చుకోవడం కూడా బీజేపీకి బిగ్ మైనస్ అవుతుందంటున్నారు.ఈ సారి 100కు పైగా నియోజకవర్గాల్లో ఉండే త్రిముఖ పోటీ కూడా మమతకు ప్లస్ అవుతుందంటున్నారు.
ఇక ఆమె ఒంటరి పోటీతో పాటు పీకే టీం గైడెన్స్ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ఆమెకు కలిసి రానున్నాయి.