'గంటా ' రాజీనామా ఆమోదిస్తే ..? జరిగేది ఇదేనా ? 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఏపీ అధికార పార్టీ వైసిపి తీవ్ర నిరాశా, నిస్పృహల్లో ఉంది.ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించడమే కాకుండా,  అక్కడ పరిపాలన చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న జగన్ కు  ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురవ్వడం,  తమకు కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఓటమి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

 If The Resignation Of 'ganta Srinivaarao, ' Is Accepted  Is This What Happens Ga-TeluguStop.com

ముఖ్యంగా జగన్ విశాఖను( Ys jagan ) రాజధానిగా ప్రకటించడమే కాకుండా,  అక్కడ పరిపాలన చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే ఈ ఫలితాలు తీవ్రంగా నిరాశా కలిగించాయి.విశాఖను రాజధానిగా వద్దని ఉత్తరాంధ్ర పట్టభద్రులు స్పష్టంగా తీర్పు ఇచ్చారని , అమరావతి రాజధానిగా ఉండాలని వారు కోరుకుంటున్నారని టిడిపి ఉదృతంగా ప్రచారం చేపట్టింది .

Telugu Ap Cm Jagan, Graduate Mlc, Jagan, Mlc, Visakha, Vizag, Vizag Steel, Ysrcp

ఈ విషయంలో తాము వెనకబడ్డామని భావిస్తున్న వైసిపి ఏదో రకంగా విశాఖలో తమకు గట్టిపట్టు ఉందని,  రాజధాని నిర్ణయాన్ని అంతా సమర్థిస్తున్నారనే విషయాన్ని రుజువు చేసుకునేందుకు సిద్ధమైంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరణ  చేయడాన్ని నిరసిస్తూ విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలోనే రాజీనామా చేశారు.ఆయన స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా చేసినా,  దానిని ఇప్పటివరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించలేదు.అయితే ఇప్పుడు ఆ రాజీనామాను ఆమోదించి అక్కడ ఉప ఎన్నికల కు వెళ్లాలనే ఆలోచనలో వైసిపి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

రాబోయే ఉప ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) ను ఓడించడం ద్వారా,  పోయిన పరువును నిలబెట్టుకోవడంతోపాటు,  టిడిపికి జనాల ఆదరణ లేదనే విషయాన్ని నిరూపించాలని జగన్ భావిస్తున్నారట.దీనిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో పార్టీ కీలక నాయకులు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు, మంత్రులు ఒక్కొక్కరిని ఇన్చార్జిగా నియమించి తమ పట్టు నిరూపించుకోవాలనే లక్ష్యంతో వైసిపి ఉందట.

Telugu Ap Cm Jagan, Graduate Mlc, Jagan, Mlc, Visakha, Vizag, Vizag Steel, Ysrcp

 తెలంగాణ లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఇదే విధంగా గ్రామానుకో ఎమ్మెల్యేని ఇన్చార్జిగా నియమించిన నేపథ్యంలో,  ఇప్పుడు అదే వ్యూహాన్ని వైసిపి విశాఖ నార్త్ నియోజకవర్గంలో ప్రయోగించాలని భావిస్తోందట.ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు ను విశాఖలో ఓడించడం అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు.విశాఖ జిల్లాలో బలమైన నేతగా గంటా శ్రీనివాసరావుకు గట్టి ఉంది.  అలాగే కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా ఉండడం,  విశాఖలో బీసీ సామాజిక వర్గంతో పాటు,  కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం ఇవన్నీ గంటా కు ఎంతో కాలంగా కలిసి వస్తున్నాయి.1999లో అనకాపల్లి ఎంపీగా గెలిచిన గంటా 2004లో చోడవరం ఎమ్మెల్యేగా , 2009లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా అనకాపల్లి నుంచి గెలిచారు .2014, 2019లో టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.సామాజికంగా , ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న గంటా తో ఇప్పుడు తలపడాలి అనుకోవడం అనవసర తలనొప్పి తీసుకువస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు వెళ్ళడమే సరైంది అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube