కారు నడపడం కంటే కార్ పార్కింగ్( Car parking ) చేయడం కొంతమందికి ఒక పెద్ద సవాలు.ఎందుకంటే పెద్ద పెద్ద నగరాలలో పార్కింగ్ స్థలం చాలా ఇరుకుగా ఉంటుంది.
మరి అలాంటి కొద్దిపాటి పార్కింగ్ స్థలంలో కారు పార్కింగ్ చేయాలంటే చాలా నైపుణ్యం అవసరం.లేదంటే కారుకు గీతలు పడడం లేదంటే డ్యామేజ్ అవ్వడం పక్క.
అయితే ఇటీవలే మార్కెట్లో విడుదల అవుతున్న కార్లు సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయి.ఈ ఫీచర్లతో పార్కింగ్ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరికినట్టే.ఇంతకీ ఆ ఫీచర్లు ఏమిటంటే.360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు.ఈ ఫీచర్లు కారులో ఉంటే ఎంతటి ఇరుకైన ప్రదేశంలో కూడా చాలా అంటే చాలా సులభంగా కార్ పార్కింగ్ చేయవచ్చు.
360డిగ్రీ కెమెరా:
( 360 degree camera ) కార్లలో అత్యంత ముఖ్యమైన భద్రత ఫీచర్ ఇదే.ఈ సిస్టమ్ కార్ల చుట్టూ ఇన్స్టాల్ చేసిన బహుళ కెమెరాలను కలిగి ఉంటుంది.ఈ ఫీచర్ నిర్దిష్ట వీక్షణ కోసం, వ్యక్తిగత ఫీడ్ ల కోసం, సిస్టం ను బట్టి ఇతర కోణాల నుంచి పూర్తి 360డిగ్రీల ఫీడ్ ను అందిస్తుంది.
పార్కింగ్ సెన్సార్లు:
( Parking sensors ) ఈ సెన్సార్లు వాహనాలలో పార్క్ అసిస్ట్ టెక్నాలజీతో వస్తాయి.ఈ ఫీచర్ ఇటీవలే విడుదల అవుతున్న ప్రతి కారులో వస్తోంది.ఈ ఫీచర్ ను ఆప్టర్ మార్కెట్ నుంచి ఇన్స్టాల్ చేయవచ్చు.ఈ ఫీచర్ కొన్ని కార్లలో ముందువైపు కూడా ఉంటుంది.కారుకు ఏదైనా అడ్డంకి వస్తువు ఉంటే వెంటనే డ్రైవర్ కు ఈ పార్కింగ్ సెన్సార్లు ఆడియో హెచ్చరికల ద్వారా సమాచారం అందిస్తాయి.
పార్కింగ్ కెమెరా:
( Parking camera ) ఈ ఫీచర్ పనితీరు దాదాపుగా పార్కింగ్ సెన్సార్ల మాదిరిగానే ఉంటుంది.కాకపోతే ఈ ఫీచర్ కారు డ్రైవర్ కు దృశ్య సహాయాన్ని అందిస్తుంది.ప్రస్తుతం వస్తున్న కార్లలో ముందు లేదా వెనుక పార్కింగ్ కెమెరాలు అందుబాటులో ఉంటున్నాయి.
ఈ కెమెరాలు తరచుగా డైనమిక్ మార్గదర్శకాలతో పాటుగా ఫీడ్ ను చూపుతాయి.
ఈ ఫీచర్లు కారులో ఉంటే కారును ఎంతటి ఇరుకైన ప్రదేశంలో కూడా చాలా అంటే చాలా సులభంగా పార్కింగ్ చేయవచ్చు.