T20 World Cup India Pakistan : అలా జరిగితే టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఇండియాతో పాకిస్తాన్ తలపడే అవకాశం ఉందా..

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ దాదాపు అన్ని మ్యాచ్లు పూర్తయి చివరి దశకు చేరుకుంది.

ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లో ఏ మ్యాచ్ లో ఏం జరుగుతుందో అని చెప్పడం కష్టంగా మారిపోయింది.

ఇంటి దారి పట్టాల్సిన పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ విజయాలు సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.కచ్చితంగా సెమీఫైనల్కు వెళుతుంది అనుకున్నా సౌత్ ఆఫ్రికా ఒత్తిడికి గురై లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది జింబాబ్వే 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్ ఆ గ్రూప్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

అయితే టీమిండియా పాకిస్తాన్ సెమి ఫైనల్ కు చేరుకోవడంతో రెండు దేశాల అభిమానులు సంతోషంగా ఉన్నారు అన్ని అనుకున్నట్లు కుదిరితే మాత్రం 2007 సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది.ఆసిన్ ఏమిటంటే మరొకసారి భారత్ పాకిస్తాన్ ఫైనల్లో తలబడితే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఐసీసీ లాంటి మేజర్ టోర్నీలలో దయాది పాకిస్తాన్ తో తలపడాలంటే ఆటగాళ్లలోనూ అభిమానులలోను ఫుల్ జోష్ ఉంటుంది అలాంటిది ఈ రెండు జట్లు ఇలాంటి మెగా టోర్నీలో ఫైనల్ లో తడబడుతున్నాయంటే ఎంత హై వోల్టేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2007లో టి20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా టి20 ప్రపంచ కప్ ను సాధించింది.

If That Happens, Is There A Possibility That Pakistan Will Face India In The Fin

అయితే టీమిండియా ఇంగ్లండ్‌తో, పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ లో తలపడనున్నాయి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం టీమిండియాకు సవాల్‌ మారింది.భీకరమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించాలంటే ఏదో లక్కీగా సెమి ఫైనల్ కు వచ్చిన పాకిస్తాన్‌ కూడా కష్టమే.

Advertisement
If That Happens, Is There A Possibility That Pakistan Will Face India In The Fin

అప్పటివరకు దుమ్మురేపే న్యూజిలాండ్‌ నాకౌట్‌ దశలో మాత్రం చేతులెత్తే అవకాశం కూడా ఉంది.మరోవైపు ఇంగ్లండ్‌ లో ఒకటో నెంబర్‌ నుంచి పదో నెంబర్‌ దాకా బ్యాటింగ్‌ ఆడగల సత్తా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించాలంటే టీమిండియా లో విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విజృంభించాల్సిందే.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు