ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాలు బ్యాన్ అయితే మన సెలబ్రెటీల పరిస్థితి ఏంటీ?

మన స్టార్స్ నుండి చిన్న సెలబ్రెటీల వరకు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా కూడా వారి సోషల్‌ మీడియా వాల్‌ పైకి వెళ్లి చెక్‌ చేస్తూ ఉంటాం.

మన స్టార్స్ అంతా కూడా వారి కి సంబంధించిన ఏ విషయాలను తెలియజేయాలన్నా కూడా సోషల్ మీడియా అకౌంట్‌ ను ఓపెన్‌ చేస్తారు.

మంచి వార్త అయినా చెడ్డ వార్త అయినా ఏదైనా కూడా అందులో షేర్‌ చేస్తూ తమ వారికి ఎప్పుడు చేరువగా ఉంటారు.అలాంటి సోషల్ మీడియా సంస్థలను త్వరలోనే కేంద్రం బ్యాన్‌ చేస్తుందా అంటే కొందరు ఔను చేసే అవకాశం ఉందని ఆందోళన కలిగించే విషయాలను చాలా కూల్‌ గా చెబుతున్నారు.

అలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఆలోచించకుండా సెలబ్రెటీలు తమ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు కిందా మీదా పడ్డారు.పాపం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌, ఇన్‌ స్టా మరియు పేస్ బుక్ లను బ్యాన్‌ చేస్తే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ఆసక్తికరంగా మీమ్స్ ను క్రియేట్‌ చేస్తున్నారు.

కొత్త సోషల్‌ మీడియాకు వెళ్తే మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టాలి.వీటికి ప్రత్యామ్నాయంగా కొత్త సోషల్ మీడియా ప్లాట్ పామ్‌ లు వచ్చాయి.

Advertisement

కాని వాటికి అలవాటు పడాలంటే కొంత సమయం కావాల్సి ఉంటుంది.అది ఎప్పటి వరకు సెలబ్రెటీలకు అలవాటు అవుతుంది.

వాటిలో ఎంత మంది మళ్లీ మమ్ముల ఫాలో అవుతారు అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా టీవీ స్టార్స్ ముద్దుగుమ్మలు తమ అందాల విందు చేస్తూ ఫొటో షూట్‌ లను షేర్‌ చేసి లక్షలు కోట్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు.

ఇప్పుడు అన్ని పోతాయి.మళ్లీ మొదటి నుండి చేసుకుంటూ రావాలంటే మామూలు విషయం కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సోషల్ మీడియాకు ఎంత మంది అలవాటు పడతారు ఎంత టైమ్‌ పడుతుంది అనేది ఇక్కడ ఆసక్తికర విషయం.సోషల్ మీడియా ద్వారానే సెలబ్రెటీ అయిన వారు ఎంతో మంది ఉన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాంటి వారి పరిస్థితి ఏంటీ అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు