ఏపీలో టీడీపీతో పొత్తుకు జనసేన సిద్దమనే సంకేతాలను ఇచ్చింది.సీఎం సీటు విషయంలోనూ తమకు.
ఎటువంటి షరతులు లేవనే సంకేతాలను స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రకటించారు.ప్రస్తుతం జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో, బిజెపిని కూడా ఈ పొత్తుకు ఒప్పిస్తానని పవన్ ప్రకటించారు.
ఇక కర్ణాటక ఎన్నికల ఫలితంతో బిజెపి హైకమాండ్ కూడా టిడిపి తో పొత్తుకు సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తుంది.ఇప్పటికే ఈ విషయంపై బిజెపికి నేతలు స్పందించారు.
మొదటినుంచి టిడిపితో పొత్తు విషయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీలైనంత దూరం పెడుతూ వస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju, ), జీవీఎల్ నరసింహారావు సైతం ఇప్పుడు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు.టిడిపి కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీలతో పొత్తు ప్రసక్తే లేదు అని చెప్పిన వీరు ఇప్పుడు పొత్తు విషయంలో సానుకూలంగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి పనిచేద్దామని చేసిన ప్రతిపాదనను హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళాము అంటూ వారు మాట్లాడుతున్నారు.

అయితే టిడిపి మాత్రం ఈ పొత్తుల అంశంపై పెద్దగా రియాక్ట్ కావడం లేదు.అంతర్గతంగా ఈ విషయాలపై చర్చ జరుగుతున్నా, బయటికి మాత్రం పార్టీ నేతలు మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు.టిడిపితో పొత్తుకు బిజెపి సిద్ధంగానే ఉన్నా, ఏపీలో వైసిపికి అన్ని విధాలుగా సహకరిస్తూ బిజెపి అంతర్గతంగా మితృత్వం కొనసాగిస్తుండడంపై విమర్శలు చేస్తున్న, ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం వంటి వ్యవహారాలపైనే జనసేన( Jana sena ) టిడిపి లకు అభ్యంతరాలు ఉన్నాయి.బిజెపి, వైసిపికి దగ్గరగా ఉందని, ఆ మాట నేను చెప్పడం లేదని ప్రజలే అనుకుంటున్నారని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు సైతం వ్యాఖ్యానించారు.

దీంతో టిడిపితో బిజెపి పొత్తుకు సిద్ధమైతే వైసీపీ( Ycp )తో తాము దూరంగానే ఉన్నామని, ఉంటామని, ఆ పార్టీ మాకు రాజకీయ శత్రువే అనే విషయాన్ని బిజెపి నిరూపించుకోవాల్సి ఉంటుంది.ఇప్పటికే ఏపీకి సంబంధించిన అనేక కీలక అంశాల్లో బిజెపి సహకారం అందిస్తుంది.వైసిపి ప్రభుత్వం కొన్ని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న, బిజెపి ప్రభుత్వం సైలెంట్ గాని ఉండడం, పరోక్షంగా సహకరిస్తుండడం, వీటన్నిటి పైన టిడిపి, జనసేనకు అభ్యంతరాలు ఉన్నాయి.ఇదే విషయాన్ని జనాల అభిప్రాయంగానే చెబుతూ బిజెపి హై కమాండ్ పెద్దలలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక ఈ విషయంలో బిజెపి కూడా తన వైఖరిని పూర్తిగా మార్చుకుంటేనే ఈ కొత్త పొత్తుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.