బంగ్లాదేశ్‌ కెప్టెన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేదం

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబల్‌ హాసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది.పలుమార్లు షకీబ్‌ బుకీలను కలవడంతో పాటు ఈ విషయాన్ని అధికారులకు చెప్పక పోవడంతో ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

 Iccbanthe Balngladesh Captain Shakibul-TeluguStop.com

గత కొన్ని రోజులుగా ఐసీసీ అవినీతి నిరోదక శాఖ వారు షకీబల్‌ను విచారించారు.ఈ విచారణలో స్వయంగా షకీబల్‌ తాను తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

బుకీలను కలవడంతో పాటు వారితో మాట్లాడినట్లుగా కూడా వారి ముందు ఒప్పుకోవడంతో శిక్ష ఖరారు అయ్యింది.

రెండు సంవత్సరాల పాటు షకీబల్‌కు నిషేదం వర్తిస్తుంది.

ఈ కాలంలో అతడి ప్రవర్తన బాగుంటే సంవత్సరంలోనే అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ సందర్బంగా షకీబల్‌ మాట్లాడుతూ తాను తప్పు చేశాను అని, తనలా యువకులు ఎవరు తప్పు చేయవద్దని సూచించాడు.

తొందరపాటుతో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నట్లుగా ఈ సందర్బంగా షకీబల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube