ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న స్టాప్ క్లాక్ రూల్( Stop Clock Rule ) ను శాశ్వతంగా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించుకుంది.2023 డిసెంబర్ నుంచి ఈ స్టాప్ క్లాక్ రూల్ ను ఐసీసీ ప్రయోగాత్మకంగా పలు మ్యాచ్లలో అమలుపరిస్తే.ఈ రూల్ బాగా వర్కౌట్ అయ్యింది.దీంతో క్రికెట్లో ఈ రూల్ ను శాశ్వతంగా అమలుపరిచేందుకు ఐసీసీ( ICC ) రెడీ అయింది.స్టాప్ క్లాక్ రూల్ ఏంటంటే.ఫీల్డింగ్ టీంకు ఓవర్ల మధ్య 60 సెకండ్ల టైం ఉంటుంది.
అంటే ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకండ్ల లోపు రెండో ఓవర్ మొదలు పెట్టాలి.నిర్ణీత సమయంలోపు ఓవర్ల కోట పూర్తి చేసేలా ఇరు జట్ల కెప్టెన్లకు ఈ కొత్త నిబంధన అలర్ట్ చేస్తుంది.
ఒక ఓవర్ పూర్తయిన వెంటనే అంపైర్ స్టాప్ క్లాక్( Umpire Stop Clock ) ఆన్ చేస్తే అందులో 60 సెకండ్లు పూర్తయ్యేలోపు మరో బౌలర్ బౌలింగ్ వేయాల్సిందే.ఈ స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది.ఓవర్ పూర్తి కాగానే థర్డ్ అంపైర్ టైమర్ ఆన్ చేస్తాడు.60 సెకండ్లు లోపు బౌలింగ్ టీం( Bowling Team ) కొత్త ఓవర్ వేయాలి.ఒకవేళ అలా వెయ్యలేకపోతే ఫీల్డ్ అంపైర్ రెండుసార్లు వార్నింగ్ ఇస్తాడు.అప్పటికి కూడా నిర్ణీత సమయంలోపు ఓవర్ వేయకపోతే చివరకు ఐదు రన్స్ పెనాల్టీ విధిస్తారు.
వన్డేలు, టీ20ల్లో ప్రతి ఓవర్ తర్వాత స్టాప్ క్లాక్ రూల్ ను అమలు పరచనున్నారు.ఈ కొత్త రూల్ 2024 జూన్ లో అమెరికా, వెస్టిండీస్ గడ్డపై జరిగే టీ20 ప్రపంచ కప్( T20 World Cup ) తో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఐసీసీ తాజాగా తెలియజేసింది.ఇప్పటికే అంపైర్ల నిర్ణయాన్ని సవాలు చేసే DRS పద్ధతి ఎంతో పాపులర్ అయింది.ఇక స్టాప్ క్లాక్ రూల్ ఇదే స్థాయిలో పాపులర్ అయ్యే అవకాశం ఉంది.