ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారంటే..?

ప్రపంచ కప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 2023 టోర్నీలో రూ.83 కోట్ల 13 లక్షల పదివేల 500 రూపాయల మొత్తాన్ని ఐసీసీ ప్రైజ్ మనీ గా కేటాయించింది.ప్రపంచ కప్ 2023( World Cup 2023 ) టోర్నీలో పది జట్లు పాల్గొనగా.మొత్తం 48 మ్యాచ్లు జరిగాయి.లీగ్ దశలో విజయం సాధించిన జట్ల నుంచి ఫైనల్ మ్యాచ్లో గెలిచి విశ్వ విజేతగా నిలిచిన జట్టు వరకు వేర్వేరు ప్రైజ్ మనీ లు( Prize Money ) అందించారు.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

 Icc Cricket World Cup 2023 Teams Prize Money Details, Icc ,cricket World Cup 202-TeluguStop.com

ప్రపంచ కప్ 2023 లో విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు( Australia ) ఐసీసీ నాలుగు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందించింది.లీక్ దశలో ఆస్ట్రేలియా ఏడు విజయాలను సాధించింది.

అందుకు రెండు లక్షల 80 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది.ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు మొత్తం సుమారుగా రూ.38 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది.ఈ టోర్నీలో రన్న రప్ గా నిలిచిన భారత జట్టు( India ) రెండు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందుకుంది.

Telugu Australia, Bcci, Cricket Cup, England, India, Zealand, Pakistan, Prize, A

లీగ్ దశ నుండి సెమీఫైనల్ వరకు మొత్తం పది మ్యాచ్లు గెలిచిన భారత జట్టుకు ఐదు కోట్ల 50 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.ఈ టోర్నీలో భారత జట్టు మొత్తం సుమారుగా రూ.22 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది.సెమీ ఫైనల్ మ్యాచ్లలో ఓడిన సౌత్ ఆఫ్రికా,( South Africa ) న్యూజిలాండ్( New Zealand ) జట్లకు చెరో 6 కోట్ల 83 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.

పాకిస్తాన్ జట్టు లీగ్ దశలో నాలుగు విజయాలు సాధించి, 2లక్షల 60వేల డాలర్ల ప్రైజ్ మనీ అందుకుంది.

Telugu Australia, Bcci, Cricket Cup, England, India, Zealand, Pakistan, Prize, A

ఆఫ్ఘనిస్తాన్ జట్టు లీగ్ దశలో నాలుగు విజయాలు సాధించి, రెండు లక్షల 60 వేల డాలర్ల ప్రైజ్ మనీ అందుకుంది.ఇంగ్లాండ్ జట్టుకు రెండు లక్షల 20 వేల డాలర్లు ప్రైజ్ మనీ దక్కింది.బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు ఒక లక్ష 80 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది.

రౌండ్ రాబిన్ లీగ్ దశకు అర్హత సాధించిన పది జట్లకు లక్ష డాలర్ల చొప్పున గ్యారెంటీ మనీ, రౌండ్ రాబిన్ లీగ్ లో ఒక్కో విజయానికి 40 వేల డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ ఐసీసీ చెల్లించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube