చంద్రబాబు, పవన్ కలవడాన్ని నేను స్వాగతిస్తున్నాను - బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయంకి చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.సోమువీర్రాజు కామెంట్స్.

 I Welcome The Meeting Of Chandrababu And Pawan Bjp Somu Veerraju, Chandrababu, P-TeluguStop.com

రైతు సంబంధిత కేంద్ర పధకాలను జగన్ సొంత పధకాలుగా ప్రచారం చేసుకున్నారు.దీని పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం.

అమరావతి రైతుల యాత్ర పై వైసిపి ఎంపి‌ దాడి చేయించడాన్ని ఖండిస్తున్నాం.ఇటువంటి ఘటనలు ఎవరూ ప్రోత్సహించ కూడదు.

దాడులను ప్రేరేపించింది వైసిపి నాయకులే.బొత్స కూడా వాస్తవం తెలుసుకుని మాట్లాడాలి.

పవన్ యాత్ర ను ప్రభుత్వం నిలిపింది, నిర్భంధించింది.ఇటువంటి ఘటనలు సరి కాదని పవన్ ను సంఘీభావంగా అందరూ కలిశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడులు జరిగాయి.

అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడి చంద్రబాబు హయాంలోనే జరిగింది.

చంద్రబాబు, పవన్ కలవడాన్ని నేను స్వాగతిస్తున్నాను.కన్నా మా‌ పార్టీ లో చాలా పెద్దలు.

నేను స్పందించను.ఆయనేదో అన్నారని… నేను అన్నింటికీ స్పందించను.

రాష్ట్ర అధ్యక్షులుగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతాను.రోడ్ మ్యాప్ పవన్ అడుగుతున్నారు.

మా పెద్దలు నిర్ణయిస్తారు.పవన్ కు బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

బిజెపి, జనసేన కలిసే ముందుకు‌ వెళతాయి.ఎపి లో జరిగిన పరిణామాలు అన్నీ మా పార్టీ పెద్దలకు వివరించాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube