టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ ( Siddharth )ఒకరు.ఒకానొక సమయంలో బొమ్మరిల్లు( Bommarillu ) నువ్వొస్తానంటే నేనొద్దంటానా ( Nuvvostanante nenoddantana ) ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.
ఇలా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సిద్దార్థ్ శర్వానంద్( Sharwanand ) తో కలిసి నటించిన మహాసముద్రం( Mahasamudram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయిందని చెప్పాలి.
ఇకపోతే తాజాగా సిద్దార్థ్ నటించిన టక్కర్ ( Takkar ) సినిమా జూన్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో ఈయన తెలుగులో కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్దార్థ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనపై కొందరు కుట్ర చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ గతంలో నేను నటించిన సినిమాలకు ఎన్నో నంది అవార్డు( Nandi Awards ) లు వచ్చాయని తెలిపారు.
తాను నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి 14 నంది అవార్డులు వచ్చాయని బొమ్మరిల్లు సినిమాకి 11 మంది అవార్డులు వివిధ కేటగిరీలలో వచ్చాయని తెలిపారు.ఇలా తాను నటించిన సినిమాలకు ఇన్ని అవార్డులు రాగా బెస్ట్ యాక్టర్ గా తనకు ఒక్క అవార్డు కూడా రాలేదని ఈయన తెలియజేశారు.ఈ సినిమాలలో నా నటన ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కొందరు కావాలని నాకు అవార్డు రాకుండా నన్ను తొక్కేసారని సిద్దార్థ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ సినిమాలు విడుదలైన సమయంలో పుట్టని వాళ్లు ఇప్పుడు నా సినిమాలు చూసి అన్న మీరు ఆ సినిమాలో నటించారు కదా చాలా అద్భుతంగా చేశారు అని చెప్పడమే నాకు పెద్ద అవార్డుతో సమానమని ఈ సందర్భంగా సిద్దార్థ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.