Rahul Ramakrishna Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమాలో శివపాత్రకు ఫస్ట్ ఛాయిస్ నేను కాదు: రాహుల్ రామకృష్ణ

రాహుల్ రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈయన అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను జాతి రత్నాలు వంటి సినిమాల ద్వారా కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 I Was Not The First Choice For Sivas Role In Arjun Reddys Film Rahul Ramakrishna-TeluguStop.com

ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ తాను హిమాయత్ నగర్ లో జన్మించానని తెలిపారు.తన ఫ్యామిలీకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదని అయితే సినిమాలపై మక్కువతో తాను ప్రియదర్శి తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ ఒకేసారి సినిమాలలో ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇక పెళ్లిచూపులు సినిమాకి తరుణ్ డైరెక్టర్ గా అవకాశం అందుకోగా అందులో ప్రియదర్శి సెలెక్ట్ అయ్యారు.

Telugu Arjun Reddys, Sivas Role-Movie

ఇక విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ తనని పరిచయం చేసి ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించారని,అర్జున్ రెడ్డి సినిమాలో తాను నటించిన శివ పాత్ర ఎంతో హైలెట్ కావడంతో తనకు ఇతర సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయని ఈయన తెలిపారు.అయితే అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత డబ్బింగ్ కార్యక్రమాలు చెప్పే సమయంలో నాకు ఒక విషయం తెలిసింది.ఈ సినిమాలో శివ పాత్రలో నటించడానికి ముందుగా అనుకున్నది తనని కాదని తన స్థానంలో ప్రియదర్శని ముందుగా సెలెక్ట్ చేశారంటూ ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube