వంటలక్క పాత్ర నాకు నచ్చదు.. కానీ తప్పక నటిస్తున్న!

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ అంటేనే ముందుగా అందరికీ గుర్తు వచ్చే పాత్ర వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్.

ఈ సీరియల్ లో ఈమె దీప పాత్రను పోషిస్తున్నప్పటికీ ఈమె మాత్రం వంటలక్కగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే తెలుగులో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇలా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందిన కార్తీకదీపం దీప ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నేను ఈ సీరియల్ లో నటించకూడదని భావించాను, కానీ తప్పక నటించాను అంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అయితే దీప ఈ విషయాలు మాట్లాడింది ఇప్పుడు కాదండోయ్.

ఈ సీరియల్ కోసం డైరెక్టర్ రాజేంద్ర గారు తనని అడిగినప్పుడు తనకు తెలుగు రాదని ఈ సీరియల్ లో నటించడానికి తనకు ఇబ్బందిగా ఉంటుందని మన వంటలక్క మొదట్లో ఈ సీరియల్లో నటించడం కోసం వెనుకడుగు వేశారట.ఈ విషయాన్ని తాజాగా దీప ఒక సందర్భంలో తెలియజేశారు.

Advertisement

ఒకవేళ అ వంటలక్క మొదట అనుకున్న విధంగానే ఈ సీరియల్లో రిజెక్ట్ చేసి ఉంటే ప్రస్తుతం స్టార్ డమ్ కోల్పోయేది అని చెప్పవచ్చు.మలయాళంలో వచ్చిన కరత ముత్తు సీరియల్‌కు కార్తీక దీపం తెలుగు వర్షన్.అయితే తాను ఈ సీరియల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, నిజానికి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారని, మలయాళంలో కంటే తెలుగులోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా దీపక్క తెలియజేశారు.

ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో నటించడం వల్ల హీరోయిన్ క్రేజ్ ఈమె సంపాదించుకుందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు