ఇంకా అలాంటి పాత్రలలో నటించాలని ఉంది... మనసులో మాట చెప్పిన పూజ హెగ్డే!

తెలుగు చిత్ర పరిశ్రమలో బుట్ట బొమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూజ హెగ్డే ( Pooja Hedg e) ప్రస్తుతం ఇతర భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

దక్షిణాది రాష్ట్రాలలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఉత్తరాది రాష్ట్రాలలో అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడానికి కష్టపడుతున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్ ( Salman Khan ) సరసన నటించిన కీసి కా భాయ్.కిసీ కీ జాన్ ( Kisi Ka Bhai.

Kisi Ki Jaan ) అనే సినిమా ద్వారా ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న పూజా హెగ్డే తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా వెల్లడిస్తున్నారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూజ మాట్లాడుతూ నేను కథలు చెప్పడానికి ఉన్నాను.సినిమాలలోని పాటలు కూడా కథలు చెబుతాయి.

Advertisement

అందుకే నాకు నచ్చినప్పుడు పాటలు కూడా చేస్తుంటానని తెలిపారు.ఇక చిన్నప్పుడు డాన్స్ చేయాలంటే చాలా భయం వేసేది కానీ మా అమ్మ భరతనాట్యం నేర్చుకోమని చెప్పింది.అప్పటినుంచి ఆస్వాదించడం నేర్చుకున్నానని ఆ క్షణమే ప్రత్యేక పాటలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు.

ఇక నటన గురించి మాట్లాడుతూ.ప్రతి భాషలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది.తాను ఏ భాషలోనైనా నటించడాన్ని చాలా గౌరవంగా భావిస్తానని తెలిపారు.

నటిగా ఇంకా నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి.ఇదివరకు నటించిన పాత్రలు కాకుండా ఇంకా చాలా మంచి మంచి పాత్రలలో నటించాలని ఉంది.

ముఖ్యంగా మహిళలలో స్ఫూర్తిని నింపే పాత్రలలో నటించాలని ఉందని ఈ సందర్భంగా మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.ప్రస్తుతం ఈమె మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు