విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంపీ కేశినేని నానికి( MP Keshineni nani ) విశ్వాసం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో నాని మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని తెలిపారు.అవినాశ్( Avinash ) కు కేశినేని నాని ముఖ్య అనుచరుడిగా మారారని కేశినేని చిన్ని ఆరోపించారు.
ఈ క్రమంలోనే కేశినేని నానికి వైసీపీలో టికెట్ వస్తుందో రాదో కూడా తెలియదని వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ – జనసేన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.అయితే ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబును( Chandrababu ) టార్గెట్ గా చేస్తుంటే.మరోవైపు టీడీపీ నేతలంతా నానిని టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు హీటెక్కాయి.