సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగే హీరోలు తమ వారసత్వాన్ని తమ పిల్లలకు అందించాలని కోరుకుంటారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది వారి పిల్లలను హీరోలుగా పరిచయం చేస్తున్న సంఘటనలను మనం చూస్తున్నాము.
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసే ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో నాగేశ్వరరావు సుమారు 75 సంవత్సరాల పాటు కొనసాగుతూ కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు.ఏఎన్ఆర్ (ANR) చివరి క్షణం వరకు ఇండస్ట్రీలోనే కొనసాగుతూ హీరోగా ప్రధాన పాత్రలలోనూ నటించడమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలకమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక చివరిగా నాగేశ్వరరావు మనం ( Manam ) సినిమాలో నటించారు ఈ సినిమా తర్వాత ఈయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటికి పరిమితమై అనంతరం తుది శ్వాస విడిచారు.

ఇదిలా ఉండగా ఏఎన్ఆర్ తన కుమారుడు నాగార్జునను ( Nagarjuna ) హీరోగా పరిచయం చేయాలని ఏ రోజు అనుకోలేదట ఇదే విషయాన్ని ఈయన బ్రతికున్నప్పుడు జయప్రద వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున గురించి నాగేశ్వరరావు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను ఇండస్ట్రీలో హీరోగా కొనసాగిన తన కొడుకు మాత్రం హీరోగా అవ్వాలని తాను ఎప్పుడు కోరుకోలేదట.
ఆయన బిజినెస్ ( Business ) వైపు వెళ్తే బాగుంటుందని నాగేశ్వరరావు అనుకున్నారట అందుకే చిన్నప్పటినుంచి తనకు యాక్టింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను ఎప్పుడూ తనకు చెప్పలేదని నాగేశ్వరరావు తెలిపారు.

ఇలా బిజినెస్ రంగం వైపు తనని పంపించాలని అమెరికా( America ) పంపించి కొలంబియాలో బిజినెస్ కి సంబంధించిన కోర్సులు చదివించాను.చదువు పూర్తయ్యాక ఇక్కడికి వచ్చి ఏదైనా బిజినెస్ పెట్టించాలని అనుకున్నాను అయితే చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి నాగార్జున తాను బిజినెస్ రంగంలోకి వెళ్ళనని సినిమాలలోకి హీరోగా వస్తానని చెప్పారు దీంతో ఒక్కసారిగా తాను షాక్ అయ్యానని తెలిపారు.అసలు నీకు డైలాగ్ చెప్పడం రాదు ఎలా నటించాలో కూడా తెలియదు కానీ హీరోగా ఎలా చేస్తావు అని నేను చెప్పినప్పటికీ నాగార్జున మాత్రం హీరోగాని నటిస్తాను అని మొండి పట్టు పట్టారు .తనని ముంబైలో ఆరు నెలల పాటు నటన విషయంలో శిక్షణ ఇప్పించానాని, అనంతరం విక్రమ్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారని తెలిపారు.అయితే ఈ సినిమాలో నాగార్జున నటన ఇంత అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరో అవుతాడని తాను అసలు ఊహించలేదు అంటూ నాగేశ్వరరావు నాగార్జున గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







