ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై స్పందించారు.
దేశంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిందన్న అసదుద్దీన్ ఒవైసీ దాన్ని ఇండియా కూటమి భర్తీ చేయలేదని చెప్పారు.ఈ క్రమంలో తాను ఇండియా కూటమిని పట్టించుకోనన్నారు.
అదేవిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ రాజకీయ శూన్యతను భర్తీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా పార్టీలతో పాటు బీఎస్పీ, బీఆర్ఎస్ కూడా ఈ కూటమిలో లేవని వెల్లడించారు.







