చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సినిమా గురించి చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా మ్యూజికల్ గా చాలా మంచి హిట్ అయింది.
ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట హైలైట్ అవడంతో చిరంజీవి గారు తనని ప్రశంసించారని ఇలా చిరంజీవి నుంచి ప్రశంసలు అందుకోవడం కన్నా గొప్ప అవార్డు ఏది లేదంటూ దేవిశ్రీప్రసాద్ తెలిపారు.

ఇక చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఆయన ఒకానొక సమయంలో తాను ఇండస్ట్రీకి దూరం అవుతూ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నానని అనౌన్స్ చేశారు.ఇలా ఇండస్ట్రీకి దూరమవుతానంటూ ఈయన చేసిన కామెంట్స్ తనని ఎంతగానో బాధపెట్టాయని,ఇంత చిన్న వయసులోనే ఈయన ఇండస్ట్రీకి దూరం కావడం ఏంటి అని బాధపడ్డానని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.ఇక తాను సినిమాలు వదిలి రాజకీయాలలోకి వెళ్తున్న నేపథ్యంలో పెద్ద పార్టీ కూడా ఇచ్చారు.

ఈ పార్టీకి రమ్మని స్వయంగా చిరంజీవి గారు అలాగే అల్లు అరవింద్ తనకు ఫోన్ చేసి పార్టీకి రమ్మని పిలిచారు.అయితే నాకు మాత్రం ఆయన సినిమాలలో నటించరు రాజకీయాలలో కొనసాగుతారని తెలిసి చాలా బాధగా అనిపించింది.తాను ఇండస్ట్రీకి దూరమవుతు ఇచ్చిన పార్టీ తనకు ఏమాత్రం నచ్చలేదని ఇలా ఇండస్ట్రీకి దూరమైతే కూడా పార్టీలు ఇస్తారా అని కూడా బాధపడ్డానని అందుకే తాను చిరంజీవి గారు ఇచ్చిన పార్టీకి వెళ్లలేదని ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







