ఫేక్ న్యూస్ పై స్పందించిన హైపర్ ఆది.. నాకు ఏం కాలేదంటూ ఆది ఆఫర్?

జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హైపర్ ఆది తన అద్భుతమైన కామెడీ పంచ్ లతో ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

 Manchu Vishnu, Jabardasth Comedian, Hyper Aadi Trolls, Hyper Aadi Reaction, Hype-TeluguStop.com

ఇదిలా ఉండగా హైపర్ ఆది తన స్కిట్ లో భాగంగా పలు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.గతంలో ఇలా ఎన్నో సార్లు నోరు జారి ఆపై క్షమాపణలు చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి.

తాజాగా మంచు విష్ణుని ఇమిటేట్ చేస్తూ చేసిన స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలోనే మంచు విష్ణును ఈ విధంగా ఇమిటేట్ చేసినందుకుగాను మంచు అభిమానులు హైపర్ ఆది పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిని చితకబాదారని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై తాజాగా హైపర్ ఆది స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు.

ఈ క్రమంలోనే ఒక వీడియో ద్వారా హైపర్ ఆది మాట్లాడుతూ అరే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి.ఎవరో నా కోసం వెతుకుతున్నారని.నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఏది నిజం లేదంటూ ఆది తెలియజేశారు.నిజం తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తారు ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీకు కావలసిన డబ్బులు నేను ఇస్తాను అంతే కానీ ఇలా తప్పుడు రాతలు రాయకండి అంటూ హైపర్ ఆది ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube