హైదరాబాద్‌ వాసులకు నిమజ్జనం సందర్బంగా పోలీసుల సూచనలు

హైదరాబాద్‌లో గల్లీ గల్లీకి వినాయక మండపాలు ఏర్పాటు చేశారు.వేల సంఖ్యలో వినాయకులు రేపు నిమజ్జనంకు సిద్దం అవుతున్నాయి.

దాంతో పోలీసు శాఖ వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులను హైదరాబాద్‌కు రప్పించడం జరుగుతుంది.

గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు వినాయక నిమజ్జనంలో పాల్గొనబోతున్న వారికి మరియు రేపు ప్రయాణాలు పెట్టుకున్న వారికి పోలీసులు కొన్ని సూచనలు చేయడం జరిగింది.ఆ సూచనల మేరకు ఫాలో అయితే ట్రాఫిక్‌ సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అంటున్నారు.

ముఖ్యంగా రేపు ఆఫీస్‌లకు మరియు ఇతరత్ర ప్రాంతాలకు వెళ్లాలి అనుకున్న వారు కేవలం మెట్రోను మాత్రమే వినియోగించాలంటూ సూచించారు.బస్సు లేదా బండ్లపై వెళ్లాలి అంటే మాత్రం ట్రాఫిక్‌లో కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.

Advertisement

మెట్రో అయితే ఎలాంటి ట్రాఫిక్‌ లేదా ఇతర ఇబ్బందులు లేకుండా వెళ్లి పోవచ్చు అంటూ పోలీసులు సూచించారు.ఇక నిమజ్జనంకు వెళ్లే వారు కూడా ప్రతి చోట పోలీసు వారు సూచించిన మేరకు వెళ్లాలని, తమకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్లడం కుదరదు అంటున్నారు.

అందరు సహకరించి రేపు ఎక్కువ ట్రాఫిక్‌ జామ్‌లు కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు