హైదరాబాద్ వీకెండ్ పార్టీ డ్రగ్స్ కేసు( Weekend Party Drugs Case )లో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు ఎఫ్ఐఆర్( FIR ) లో కీలక విషయాలను పొందుపరిచారు.
పది మంది కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలోనే పలువురు వ్యాపార వేత్తలను అదుపులోకి తీసుకున్నారు.
కాగా పేపర్ రోల్ లో కొకైన్ ను చుట్టి నిందితులు డ్రగ్స్ వినియోగించారని తెలుస్తోంది.దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ పార్టీలో మరి కొంతమంది ఉన్నారని పోలీసులు గుర్తించారు.