భార్యను స్నేహితులతో అత్యాచారం చేయించి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

ఉత్తర ప్రదేశ్‌లో ఆడవారిపై అఘాయిత్యాలకు కొదవే ఉండదు.అత్యంత దారుణంగా అక్కడ సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

 Husband Friends Raped His Wife In Uttar Pradesh-TeluguStop.com

తాజాగా ఒక సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి ఆమె మత్తుగా పడుకున్న సమయంలో తన నలుగురు స్నేహితులను తీసుకు వచ్చి అత్యాచారం చేయించాడు.

ఆ విషయాన్ని వీడియో తీసిన అతడు ఆ తర్వాత ఆ వీడియోను చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు.తలాక్‌ చెప్పి ఆమెను బయటకు పంపించాడు.

విషయం బయటకు చెబితే వీడియోలు బయటకు వెళ్తాయంటూ హెచ్చరించాడు.

ఆమె అతడి మాటలకు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇచ్చింది.

అతడిపై కేసు నమోదు అయ్యింది.మిగిలిన ఆ నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే ఆమెపై కోపంతో ఇలా చేసినట్లుగా భర్త చెప్పాడు.ఆమెను ప్రేమించిన అతడు పెళ్లి చేసుకోకుండా వదిలించుకోవాలనుకున్నాడు.

కాని తనను వాడుకుని పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరికి పెళ్లి చేశారు.పెళ్లి తర్వాత కాపురం పెట్టి కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న భర్త ఆ తర్వాత తన నిజ స్వరూపంను బయట పెట్టాడు.

తన జీవితాన్ని ఆమె నాశనం చేసిందని అతడు భావించాడు.అందుకే ఆమెకు తలాక్‌ చెప్పినట్లుగా పేర్కొన్నాడు.

ఇలాంటి నీచులు కూడా ఈ భూమి మీద ఉన్నారా అనిపిస్తుంది కదా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube