ఈ వకీల్‌సాబ్‌కు నూరేళ్లు.. ఇంకా వాదనలు వింటూనే ఉన్నారు!

చదువుకు వయస్సుతో పనిలేదంటారు.అయితే, ఇక్కడ మనం తెలుసుకోబోయే వార్త కాదు నిజంలో నేర్చుకునేందుకు వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని తెలుస్తోంది.

ఇది ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచింది.అదేంటో తెలుసుకుందాం.

ఆ న్యాయవాదికి నూరేళ్లు, అయినా .ఇంకా కోర్టు వాదనలు వింటూనే ఉన్నారు.ఈ విధంగా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.

ఆ న్యాయవాది పేరే లేఖ్రజ్‌ మెహతా.వయస్సులో సెంచరీ కొట్టినా.వృత్తికి బ్రేక్‌ ఇవ్వలేదు.

Advertisement
Hundred Years Completed Lawyer Still Hearing Cases, Lawyer, Cm, Chief Justice, 1

పైగా కేసు వాదనలో ఉత్సుకత చూపించడం ఆశ్చర్యపరుస్తోంది.ఈ ప్రముఖ లాయర్‌ రాజస్థాన్‌ జోద్‌పూర్‌కు చెందిన లేఖ్రాజ్‌ మెహత ఆ వృత్తిలో కొనసాగుతూ ఇటీవలె ఆయన 100వ పుట్టిన రోజు వేడుకను నిర్వహించుకున్నారు.1921లో పుట్టిన ఆయనకు ఈ వృత్తిలో ఎంతో పేరు ప్రతిష్టలు పొందారు.ఈయన ఎన్నో కేసులు, మరెన్నో విషయాలు, అంతర్జాతీయ, జాతీయ కోర్టుల జడ్జీలకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సలహాలు సూచనలు ఇచ్చారు.

ఈ వృతిలో మెహతా 1947 నుంచి కొనసాగుతున్నారు.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా వాదనలకు అటెండ్‌ అవుతున్నారు.అన్ని కేసుల్లో ఇతర యంగ్‌ లాయర్లకు దీటుగా వాదిస్తున్నారు.

ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడంలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు.ఈ వీడియోకాలింగ్‌ వాదనలు వినడానికి కూడా ఆ వీడియో ద్వారా మీటింగ్‌లను గత ఏడాది లాక్‌డౌన్‌లోనే నేర్చుకున్నారు.

అంటే మెహతా కరోనా ద్వారా కొత్త ప్రస్తుతం ఎలా ఆన్‌లై¯Œ సమావేశాలను కూడా నేర్చుకున్నారు.ఎందుకంటే మన పెద్దవారికి కూడా ఏ అంశాన్నైనా సులభంగా అర్థంచేసుకునేవారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అయితే, మెహతకు మనవడు ఉన్నాడు.అతని పేరు రామిల్‌ మెహత.

Hundred Years Completed Lawyer Still Hearing Cases, Lawyer, Cm, Chief Justice, 1
Advertisement

ఇతని ద్వారానే మన వకీల్‌సాబ్‌ ఆన్‌లైన్‌ వాదనలకు హాజరవ్వడాన్ని నేర్చుకున్నాడు.ఆయన న్యాయవాద మజిలీలో ఎన్నో కేసులు, మరెన్నో వాదనలు, మారిన జనజీవన విధానాలు.ఏదైనా సులభంగా నేర్చుకునే మెహత తన వృత్తిలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలుస్తున్నారు.

వృత్తికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు.ఈయన వద్ద న్యాయవాద పాఠాలు నేర్చుకున్న ప్రముఖుల అనేక మంది ఉన్నారు.

అందులో మాజీ చీఫ్‌ జస్టీస్‌ ఆర్‌ఎం లోధా, జస్టీస్‌ దల్బీర్‌ భండారి, ఎంఎల్‌ సింఘ్వీ.ఈయన వాదించిన కేసుల్లో అతి ముఖ్యమైంది బాలివుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ జింకల వేట కేసు.

అదేవిధంగా ఒక్క ఓటుతో పరాజయం పాలైన కాంగ్రెస్‌ నేత సీపీ జోషి కేసు, భైరావ్‌ సింగ్‌ షెకావత్‌ కేసు ఇలా ఎన్నో కేసులు వాదించారు, విజయం సాధించారు.

తాజా వార్తలు