యాంకర్ ముస్లిం అని లైవ్ డిబేట్ లో అలా చేసాడు

కరుడుగట్టిన హిందుత్వ చాందసం రోజురోజుకి దేశంలో పెరిగిపోతుంది.మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బిజెపి పరిపాలనలో హిందుత్వ ముసుగులో అరాచకాలు చేసే వారి సంఖ్య పోతుంది.

 Hum Hindus Ajay Gautam Refuses To Look At Muslim Tv Anchor-TeluguStop.com

మరోవైపు ఈ మతాన్ని ఉపయోగించుకొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చాలామంది కుహనా మేధావులు చేస్తున్నారు.అయితే ప్రజల్లో కూడా ఏదో మూల ఈ హిందూత్వ భావజాలం గూడుకట్టు పోవడంతో వారు కూడా ఈ మధ్యకాలంలో కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా హైదరాబాదులో జుమాటో ఫుడ్ డెలివరీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.

జుమాటో ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి హిందువు కాదని ఒక కస్టమర్ తన డెలివరీ రద్దు చేసుకున్నాడు.

దీనిపై ఓ న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహిస్తున్న సందర్భంగా హిందుత్వ సంస్థ అయిన హమ్ హిందూ అధ్యక్షుడు అజయ్ గౌతమ్ కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు.ఈ కార్యక్రమం ఓ ముస్లిం యాంకర్ నిర్వహిస్తూ ఉండగా అతనిని చూడకుండా చేతులు అడ్డు పెట్టుకుని మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది.

సదరు యాంకర్ హిందూ కాకపోవడంతోనే అతడి ముఖం చూడలేను అంటూ అజయ్ గౌతమ్ కామెంట్ చేస్తూ వివాదాస్పదంగా వ్యవహరించడం సంచలనంగా మారింది.దీనిపై సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా విపరీతంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇలాంటి హిందుత్వ కరుడుగట్టిన భావజాలం ఉన్నంతవరకు ప్రజాస్వామ్య దేశంలో సామాజిక మార్పు సాధ్యం కాదని చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube