అప్పుడు కార్చిచ్చు... ఇప్పుడు ధూళి తుఫాన్! ఆస్ట్రేలియాని భయపెడుతున్న ప్రకృతి

ఆస్ట్రేలియాపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది.

గత కొంత కాలంలో న్యూ సౌత్ వేల్స్ ఫారెస్ట్ లో కార్చిచ్చు చెలరేగి వేల కోట్ల జీవులని సజీవ సమాధి చేసాయి.

ఈ కార్చిచ్చు కారణంగా కొన్ని లక్షల ఎకరాలలో అడవులు ధ్వంసం కావడంతో పాటు అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోయాయి.ప్రపంచ దేశాలు యావత్తు ఈ దారుణ విపత్తుపై విచారం వ్యక్తం చేస్తున్నాయి.

Hugedust Storms In Australiahit Centralnew South Wales-అప్పుడు �

ఇంత ఘోరమైన విపత్తు చరిత్రలో మన కళ్ళముందు జరగడం నిజంగా దారుణమని అన్నారు.దీనిని నిలువరించడానికి ప్రయత్నం చేసిన కూడా సాధ్యం కాలేదు.

ఈ ప్రకృతి విధ్వసంని మరిచిపోక ముందే ఆస్ట్రేలియాపై మరోసారి ప్రకృతి తన ప్రతాపం చూపించింది.నిజానికి ఎడారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వచ్చే ఇసుక, ధూళి తుఫాన్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో మూడు పట్టణాలని ముంచేసింది.

Advertisement

వేల సంఖ్యలో సైన్యం దండయాత్ర చేసినట్లు, సునామీ సమయంలో అలలు నగరంపై పడి విధ్వసం `సృష్టించినట్లుగానే ఈ ధూళి తుఫాన్ తన ప్రతాపం చూపించింది.జనావాసాలపై ధూళి తుఫాన్ దూకుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మధ్యప్రాచ్యంలో ఇలాంటి ధూళి తుఫానులు సహజమేకానీ, ఆసీస్‌లో ఇలా జరగడం చాలా అరుదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.ఈ తుఫాను తొలుత నారోమైన్ పట్టణాన్ని చుట్టుముట్టింది.

ఆ తర్వాత నెమ్మదిగా డబ్బో, ఆపై పార్క్స్ ఇలా ఒక్కో సిటీనే కమ్మేస్తూ ముందుకుసాగింది.దీని వల్ల ఈ ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

అయితే ప్రాణ నష్టం ఏ స్థాయిలో జరిగింది అనే విషయం తెలియరాలేదు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు