మెగాస్టార్ చిరంజీవి సుస్మిత కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.అయితే కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయింది.
ప్రధానంగా భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ఫ్లాప్ కావడం, కళ్యాణ్ కృష్ణ మూవీ కూడా రీమేక్ కావడం, కూతురు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా విషయంలో రిస్క్ వద్దని చిరంజీవి( Chiranjeevi ) ఫీల్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోయినా సుస్మితకు( Sushmita Konidela ) మాత్రం కోటి రూపాయలు నష్టం వచ్చిందని తెలుస్తోంది.
ఈ సినిమా కథకు సంబంధించిన వర్క్స్ వల్ల ఆ మొత్తం నష్టపోవాల్సి వచ్చిందని బోగట్టా.ప్రస్తుతానికి ఈ కథను మూలన పడేశారని ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా లేదని సమాచారం అందుతోంది.
చిరంజీవి వశిష్ట కాంబో మూవీకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.చిరంజీవి భవిష్యత్తు కెరీర్ లో భోళా శంకర్ తరహా ఫలితాలు రిపీట్ కాకూడదని అభిమానులు ఫీలవుతున్నారు.చిరంజీవి సుస్మిత కాంబినేషన్ లో భవిష్యత్తులో అయినా సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.
ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో తెరకెక్కుతుండగా ఆ సినిమాలు సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.చిరంజీవి పారితోషికం( Chiranjeevi Remuneration ) కూడా భారీ రేంజ్ లో ఉంది.చిరంజీవి ఏడాది సంపాదన 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందని సమాచారం అందుతోంది.
చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.చిరంజీవి కూతురు ఇతర మెగా హీరోలతో సినిమాలను నిర్మిస్తే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.