మణిపూర్ రాష్ట్రంలో భారీ శాంతి ర్యాలీ..!!

గత కొద్ది నెలలుగా మణిపూర్ రాష్ట్రం( Manipur )లో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

అల్లర్ల ముసుగులో ఓ తెగకు చెందిన ఆడవాళ్లపై లైంగిక దాడులు చేసి హత్యలు కూడా చేయడం జరిగింది.

ఈ క్రమంలో నగ్నంగా కొంతమంది ఆడవాళ్లను వీధులలో ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవటం లేదని.

దేశంలో పలు పార్టీల నేతలు కామెంట్లు చేస్తున్నారు.మణిపూర్ ఉద్రిక్తత పరిస్థితులకు బాధ్యుడిగా సీఎం బీరేన్ సింగ్ రాజీనామా( Manipur CM Biren Singh Resignation ) చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు దేశవ్యాప్తంగా చాలామంది నిరసనలు( Protests ) తెలియజేయడం జరిగింది.కాగా తాజాగా శనివారం మణిపూర్ రాష్ట్రంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర స్థానికులు శాంతి ర్యాలీ నిర్వహించారు.

Advertisement

మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఈ ర్యాలీ జరిగింది.స్థానికంగా అల్లర్లకు కారణమైన సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోవాలని ర్యాలీలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

రెండు నెలల నుండి జరుగుతున్న దాడులలో మణిపూర్ రాష్ట్రంలో చాలామంది ప్రాణాలు విడవటం జరిగింది.మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపింది.

Advertisement

తాజా వార్తలు