వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్..!

వన్ ప్లస్ 11 5G( OnePlus 11 5G ) స్మార్ట్ ఫోన్ పై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించబడింది.వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.56999 కాగా గతంలో ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడం జరిగింది.ఇప్పుడు తాజాగా మరోసారి రూ.3000 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడంతో రూ.51999 కే కోనుగోలు చేయవచ్చు.అంతేకాదు సెలెక్ట్ చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3000 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు.అంతేకాదు స్మార్ట్ ఫోన్ పై ఎక్సైజ్ ఆఫర్ కూడా ఉంది.

 వన్ ప్లస్ 11 5g స్మార్ట్ ఫోన్ పై ఊ-TeluguStop.com

వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.7 అంగుళాల క్వాడ్ HD ప్లస్ డిస్ ప్లే తో ఉంటుంది.క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ కు( Super Vooc Fast Charging ) సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా సెటప్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.10-బిట్ LTPO 3.0 AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.

సోనీ IMX 471 సెన్సార్ కెమెరాతో ఉంటుంది.

ఈ ఫోన్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ లో అలర్ట్ స్లైడర్ లాంటి ఆప్షన్లు అందించారు.ఇక ఈ ఫోన్లో ఉండే మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.5జీ, 4జీ, వైఫై 6, బ్లూటూత్ 5.3, GPS, NFC,USB 2.0 టైప్-C కనెక్టివిటీ లాంటి ఫీచర్లతో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube