టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈ మేరకు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలపల్లిలో యువగళం -నవశకం పేరుతో సభను నిర్వహిస్తున్నారు.
రేపు జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.సుమారు 110 ఎకరాల స్థలంలో సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతుండగా దాదాపు ఆరు లక్షల మంది సభకు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.