భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న హీరోలలో హృతిక్ రోషన్( Hrithik Roshan ) ఒకరు కాగా ప్రస్తుతం వార్2 సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు.హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో హృతిక్ రోషన్ మరో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అయితే హృతిక్ రోషన్ ఫస్ట్ రెమ్యునరేషన్ మాత్రం కేవలం 100 రూపాయలు కావడం గమనార్హం.
హృతిక్ రోషన్ కు ఇప్పటివరకు 30,000 మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయని సమాచారం అందుతోంది.హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ ( Fighter Movie )తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ కపూర్( Anil Kapoor ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సీన్స్ తో ఉన్న ఈ టీజర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో మెప్పించింది.2024 సంవత్సరం జనవరి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.తొలి మూవీతోనే హృతిక్ కు 30 వేల మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం హాట్ టాపిక్ అవుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న హృతిక్ రోషన్ ఆశ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.వార్2 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హృతిక్ రోషన్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.హృతిక్ రోషన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.హృతిక్ రోషన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.