బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ ఆలీఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’.పుష్కర్ – గాయత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
బుధవారం ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్‌తో ‘విక్రమ్ వేద’ ఆడియెన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది.
వేద పాత్రలో హృతిక్ రోషన్.విక్రమ్ పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు.
అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి ఎంగేజింగ్ స్టోరి నడిచిందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీజర్ వ్యవధి 1 నిమిషం 46 సెకన్లుగా ఉంది.
ఈ చిన్న టీజర్‌లోనే విక్రమ్ వేద మధ్య జరిగే కథా ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు.ప్రేక్షకులు ఆనందంతో విజిల్స్ వేసే డైలాగ్స్, భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌తో ఎమోషనల్ డ్రామాగా సినిమా రూపొందిందని తెలుస్తోంది.
ఈ సన్నివేశాలను బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్‌కి తీసుకెళ్లింది.కంప్లీట్ ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజ్‌గా ‘విక్రమ్ వేద’ తెరకెక్కిందని టీజర్‌తో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది.
హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ ఆలీఖాన్‌లతో పాటు సినిమాను డైరెక్ట్ చేసిన పుష్కర్ – గాయత్రిలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.దీంతో సెప్టెంబర్ 30న సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విక్రమ్ వేద’ చిత్రంలో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి.విక్రమ్ (సైఫ్ ఆలీఖాన్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరికీ దొరకని కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వేద (హృతిక్ రోషన్)ను పట్టుకోవటానిక ప్లాన్ చేస్తుంటాడు.
పిల్లి – ఎలుకలా ఒకరి వెనుక ఛేజింగ్‌లా జరిగే వీరి కథలో విక్రమ్‌కి వేద కొన్ని కథలను చెబుతుంటాడు.వాటి ఆధారంగా విక్రమ్ ఏం తెలుసుకున్నాడనేదే ప్రధాన కథాంశం.
గుల్షన్ కుమార్ సమర్పణలో టీ సిరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ కలిసి ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, జియో స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ ప్రొడక్షన్ కాంబినేషన్‌తో ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భూషణ్ కుమార్, ఎస్.
శశికాంత్ నిర్మాతలు.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 30 భారీ ఎత్తున రిలీజ్‌కి సిద్ధమవుతోంది.