Hrithik Roshan War 2 : మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్ తో వార్ 2 మొదలు పెట్టబోతున్న హృతిక్ రోషన్ 

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్( Hero Hrithik Roshan ) తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు.

జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.

హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2.రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు.అతిత్వరలో వార్ 2( War 2 ) మొదలు కాబోతోంది.బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో అని తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు.ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.

హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది.దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది.

వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు. 

Hrithik Roshan Action Scenes In War 2 Movie
Advertisement
Hrithik Roshan Action Scenes In War 2 Movie-Hrithik Roshan War 2 : మైండ

వార్ 2 లో ఈ సరి హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి.ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్( Yash Raj Films Spy Universe ) లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు.

ఈ ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు.

ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట.  

Hrithik Roshan Action Scenes In War 2 Movie
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్ లో కష్టపడుతున్నారు.ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు.ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు.

Advertisement

వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ చిత్రం డార్క్ థీమ్ లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రం ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది.ఇటు సౌత్ లో ఉన్న అభిమానులకు, నార్త్ లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే.

వచ్చే ఏడాది ఆగష్టు 14న( War 2 Release Date ) ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు