చర్మ ఛాయను పెంచే నువ్వులు.. ఎలా వాడాలో తెలుసా?

నువ్వులు.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

చక్కటి రుచిని కలిగి ఉండే నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే అందాన్ని పెంచడానికి కూడా నువ్వులు సహాయపడతాయి.ముఖ్యంగా చర్మ ఛాయను పెంచడానికి నువ్వులు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.

మరి ఇంతకీ చర్మానికి నువ్వుల‌ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
How To Use Sesame Seeds For Skin Whitening! Sesame Seeds, Sesame Seeds Benefits,

ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తరుముకోవాలి.ఈ తురుము నుంచి క్యారెట్ జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

How To Use Sesame Seeds For Skin Whitening Sesame Seeds, Sesame Seeds Benefits,

చివరిగా సరిపడా క్యారెట్ జ్యూస్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్‌ సహాయంతో ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజులకు ఒకసారి కనుక చేస్తే స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

How To Use Sesame Seeds For Skin Whitening Sesame Seeds, Sesame Seeds Benefits,
న్యూస్ రౌండప్ టాప్ 20

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.ఒకవేళ ముడతలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.

Advertisement

చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మెరిపించడానికి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.

తాజా వార్తలు