జుట్టు రాలే సమస్యకు లవంగాలతో ఈజీగా చెక్ పెట్టండిలా..!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఇండియన్ స్పైసెస్ లో లవంగాలు( Cloves ) ఒకటి.చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్న చాలా ఘాటుగా ఉంటాయి.

ఆహారానికి ప్రత్యేకమైన రుచిని జోడించడంలో లవంగాలు ఎంతో బాగా సహాయపడతాయి.అలాగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

అంతేకాదండోయ్ కురుల సంరక్షణకు కూడా లవంగాలు తోడ్పడతాయి.ముఖ్యంగా జుట్టు రాలే సమస్యకు( Hair Fall ) లవంగాలతో చెక్ పెట్టవచ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Use Cloves To Stop Hair Loss Details, Stop Hair Fall, Hair Loss, Hair Fa
Advertisement
How To Use Cloves To Stop Hair Loss Details, Stop Hair Fall, Hair Loss, Hair Fa

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరు వెచ్చ‌గా అయ్యాక‌ వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

How To Use Cloves To Stop Hair Loss Details, Stop Hair Fall, Hair Loss, Hair Fa

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.ఆపై గంట పాటు షవర్ క్యాప్ ధరించాలి.చివరిగా తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర సమ్మేళనాలు నిండి ఉంటాయి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, జుట్టు రాలడాన్ని నివారించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.అలాగే లవంగాలు జుట్టుకు మెరుపు మరియు బలాన్ని చేకూరుస్తాయి.

Advertisement

లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.ఇవి చుండ్రు ను నివారించడంలో సహాయపడతాయి.

ఇక రైస్ మరియు ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.

తాజా వార్తలు