ఏ ఆటలోనైనా గెలవడానికి రెండు పద్ధతులు ఉంటాయి , ఒకటి తన బలాన్ని మెరుగుపరుచుకొని గెలవడం.రెండు ప్రత్యర్థి బలహీనతలను తెలుసుకొని తద్వారా విజయం సాధించడం రాజకీయాలు కూడా ఒక క్రీడగా మారిపోయి చాలా కాలమైంది.
గెలవడానికి అన్ని రకాల శక్తి యుక్తులను రాజకీయ నాయకులు పన్నుతున్నారు.10 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నా ఇంకా అసెంబ్లీకి వెళ్లని పార్టీగా విమర్శలు ఎదుర్కుంటున్న జనసేన( Jana sena ) ఇప్పుడు తన బలాన్ని గుర్తించినట్లే ఉంది.పరిమితమైన ఆర్థిక వనరులతో రాష్ట్రం మొత్తం ఫోకస్ పెట్టడం కుదిరే పని కాదు.
అందునా పార్టీ నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో జరగని ఒక పార్టీ రాష్ట్రస్థాయిలో తన బలాన్ని కేంద్రీకరిస్తూ పోటీ చేయడం అన్నది ఆత్మహత్య సదృశ్యం అనే చెప్పాలి.అందుకే ఒంటరిగా వెళ్లి వీరం మరణం పొందను అని ముందే చెప్పిన పవన్ ఇప్పుడు తన బలాన్ని అంతా తన అనుకూల ప్రాంతంలో పెట్టి అధికార పార్టీ నాయకులకు ఊపిరి రాడనివ్వకుండా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి .
ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా చెబుతూ తమ నాయకుల అవినీతిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )ని ఎదుర్కోవటం ఎలానో ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు అర్థం కావడం లేదని తెలుస్తుంది.స్వయానా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ ఆయన పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్నారంటే పవన్ ని ఎదుర్కోవడానికి వారి వద్ద ఏ విధమైన ఆయుధం లేనందుకే అని చెప్పాలి పవన్ పెళ్లిళ్ల గురించి టాపిక్ ఇప్పటిది కాదు, జనం కూడా దాన్ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది.ఇప్పటికి కూడా అవుట్ డేటడ్ విమర్శలనే అధికార పార్టీ చేస్తూ ఉంది అంటే పవన్ వారికి అవకాశం ఇవ్వడం లేదనే చెప్పాలి.
అంతేకాకుండా ప్యాకేజ్ స్టార్ అని పదే పదే విమర్శలు చేసే అధికార పార్టీ తమ అధికారాన్ని ఉపయోగించిన పవన్ ఎక్కడ ఆర్థిక ప్రయోజనం పొందారో నిరూపించి ఉంటే ఆ ఆరోపణలకు కొంత చిత్తశుద్ధి వచ్చి ఉండేది.పవన్ పై అధికార పార్టీ చేసే ప్యాకేజీ ఆరోపణల పై తెలుగుదేశం పార్టీ( TDP ) కూడా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటుంది.ఒక రకంగా పవన్ పై ఆ ముద్ర బలపడడానికి తెలుగుదేశం వ్యవహార శైలి కూడా ఒక కారణమని చెప్పాలి అయితే ఎన్ని విమర్శలు చేసినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో తాను క్రియాశీలక పాత్ర పోషించబోతున్నాను అని జనసేన బలంగా చాటుతుంది .ప్రస్తుతానికైతే జనసేన ను ఎదుర్కోవడానికి అధికార పార్టీ దగ్గర ఏ విధమైన ఆయుధం లేనట్లే ఉంది.మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy