సినిమాలో ఒక్కసారి కనిపించి ఆ రంగుల ప్రపంచం అలవాటు అయ్యిందంటే చాలు అది మనిషిని చచ్చేదాకా వదలదు.హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగు కెరీర్ ముగిసాక ఇంట్లో ఖాళీగా కూర్చువాలంటే అది జరిగే పని కాదు.
అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నటించన్ కాస్త వయసు పై బడిన హీరోయిన్స్ అయినా నటి నటులు అయినా కోరుకుంటూ ఉంటారు.అందుకు ఎవరు అతీతులు కాదు.
ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా హడావిడి ఒక పీక్ లో ఉన్న విషయం మనందరికి తెలిసిందే.అందుకే కలిగే ఉంటున్న వారు ఈ మధ్య ఎక్కువ గా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.
తమ పని అయిపోలేదని, తమలో ఇంకా చాల సత్త ఉందని చూపిస్తూ ఉన్నారు.ఇంకో అడుగు ముందుకు వేస్తే గతం లో హీరోయిన్స్ గా చలామణి అయ్యి ఇప్పుడు మళ్లి బిజీ అవ్వాలంటే అందుకు టీవీ కూడా బాగా పని చేస్తుంది.
మొదట కామెడి షో లకు, డ్యాన్స్ షో లలో గెస్ట్ లుగా కనిపించడం, లేదా జడ్జిలుగా కనిపించడం వంటివి చేస్తున్నారు.దీని వల్ల ఆదాయం తో పని కూడా ఉంటుంది.
ఇంకో వైపు జనాల్లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు.

తద్వారా సినిమా అవకాశాలను కూడా సంపాదితున్నారు.మొన్నటికి మొన్న లైలా టీవీ లో ఇంటర్వ్యూ లు ఇవ్వడం, షో లకు గెస్ట్ గా రావడం చేసి ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది.లయ సైతం అమెరికా నుంచి వచ్చేసి తన పిఆర్ పెంచుకునే పనిలో పడింది.
ప్రియమణి,సదా, ఇంద్రజ వంటి మాజీ హీరోయిన్స్ అంత కూడా ఇలా రియాలిటీ షోలలో సందడి చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇలా మొత్తానికి సోషల్ మీడియా, టీవీ మీడియా లో కనిపించక పోతే ఖచ్చితంగా మళ్లి ఫామ్ లో ఉండలేము అని మన హీరోయిన్స్ అందరికి అర్ధం అయిపోయింది.అందుకే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన సరే సినిమాలో కనిపించాలంటే బుల్లి తెర పై కొంత హడావిడి తప్పదు అని తెలుసుకున్నారు.ఏది ఏమైనా ఇన్ని బాధలు హీరోయిన్స్ కి మాత్రమే హీరోలకు ఈ సమస్యలు ఏమి ఉండవు.50 ఏళ్ళు వచ్చిన 60 దాటినా వారు ఎప్పటికి హీరోలే కదా.!
.






