షోరూమ్‌లో మిగిలిపోయిన బట్టలను ఎలా అమ్ముతారో తెలిస్తే.. షాక్ అవుతారు!

బట్టల షాపుల్లో అమ్ముడుపోని బట్టలను ఏం చేస్తారో చాలా మందికి తెలియదు.ఒక తాజా సర్వేలో అమ్ముడుపోని బట్టలను( Unsold Clothes ) షాపులు పడేస్తాయని పార్టిసిపెంట్లు అభిప్రాయపడ్డారు.

 How To Sell Unsold Clothes At A Clothing Showroom Details, Textile Shops, Unsold-TeluguStop.com

అయితే, నిజానికి అమ్ముడుపోని బట్టలను వివిధ విధాలుగా విక్రయిస్తారు.ఆ విధానాలు తెలియడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఒక దుకాణదారుడు ఇచ్చిన సమాధానం ప్రకారం, కొన్ని షాపుల్లో మిగిలిపోయిన బట్టలను డిస్కౌంట్ సేల్‌లో( Discount Sale ) అమ్ముతారు.ఇంకొన్ని షాపులు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు అమ్మేస్తుంటాయి.

మరికొన్ని షాపులు ఏడాది ముగింపు సమయంలో 50% సేల్ కండక్ట్ చేస్తాయి.డిస్కౌంట్ సేల్ తర్వాత కూడా అమ్ముడుపోని బట్టలను షాపు యజమాని దానం చేయవచ్చు లేదా తక్కువ ధరలకు విక్రయించవచ్చు.

దానం చేయడం ద్వారా, అవి అవసరమైన వారికి సహాయం చేస్తాయి.

ఫెస్టివల్ సమయంలో, ప్రజలు కొత్త బట్టలు కొనడానికి ఆసక్తి చూపుతారు.అందువల్ల, అమ్ముడుపోని బట్టలను ఫెస్టివల్ సేల్‌లో( Festival Sale ) విక్రయించడం ద్వారా, షాపు యజమానులు కొంత లాభం పొందుతారు.ముఖ్యంగా బ్రాండెడ్ క్లాసెస్ ఎంత కాలం ఉన్నా కొత్తగా కనిపిస్తాయి వీటిపై తమకు మంచి లాభం అందుతుందని ఒక దుకాణదారుడు తెలిపాడు.

రీసైక్లింగ్ కి కూడా కొందరు పంపిస్తుంటారు.

ఇవేమీ కుదరకపోతే, కొన్ని షాపులు అమ్ముడుపోని బట్టలను చిన్నపాటి రిటైర్లకు అమ్ముతారు.లేదంటే గ్రామీణ ప్రజలకు లేదా పేదలకు మాయమాటలు చెప్పి విక్రయిస్తాయి.మొత్తం మీద బట్టల షాపు దుకాణదారులు ఏ విధంగానూ నష్టపోరు.

ఓల్డ్ స్టాక్( Old Stock ) కొనుగోలు చేసి కస్టమర్లు కొంత మేర డబ్బులు కూడా తగ్గించుకోగలుగుతారు.దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube