అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?

హెయిర్ ఫాల్( Hairfall ) అనేది దాదాపు అందరిలోనూ ఉంటుంది.కానీ కొందరిలో మాత్రం చాలా అధికంగా ఉంటుంది.

అధిక హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా తయారవుతుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే మన వంటింట్లో ఉండే అల్లం( Ginger ) జుట్టు రాలడాన్ని అరికట్టడం లో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ అల్లాన్ని జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించాలి.

ఆపై అల్లాన్ని సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం తురుము వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు, ఒక కప్పు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి.

మరుసటి రోజు క్లాత్ లో అల్లం మిశ్రమాన్ని వేసుకుని ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని సున్నితంగా తల మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ ( Oil ) అప్లై చేసుకున్న నాలుగు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే చాలా బెనిఫిట్స్ పొందుతారు.

ముఖ్యంగా అల్లం, నువ్వులు, ఆముదం, కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్ సమస్యకు చాలా వేగంగా అడ్డుకట్ట వేస్తాయి.అలాగే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఆయిల్ ను తయారు చేసుకుని వాడితే జుట్టు దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది.

రాజాసాబ్ మూవీతో ఆ రికార్డ్ అందుకోనున్న ప్రభాస్.. కచ్చితంగా సాధ్యం అంటూ?
కిడ్నీలలోనీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..!

హెయిర్ బ్రేకేజ్ సమస్య దూరం అవుతుంది.మరియు కురులు దట్టంగా సైతం పెరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు