జామపండుతో బాడీ లోషన్‌.. ఎలా త‌యారు చేసుకోవాలంటే?

త‌క్కువ ధ‌రకే ల‌భించే ఓ అద్భుత‌మైన పండు జామ‌పండు. ఎంత రుచిగా ఉంటుందో అంతే ఎక్కువ పోష‌కాల‌నూ జామ పండు క‌లిగి ఉంటుంది.

పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, జింక్‌, ఐర‌న్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా పోష‌కాలెన్నో జామ‌లో నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా జామ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికి జామ పండు ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా జామ పండుతో బాడీ లోష‌న్‌ను చేసుకుని వాడితే.

మ‌స్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం జామ పండుతో బాడీ లోష‌న్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న‌ది లేట్ చేయ‌కుండా చూసేయండి.ముందుగా బాగా పండిన జామ పండును తీసుకుని.

Advertisement
How To Make Body Lotion With Guava Details! Body Lotion With Guava, Body Lotion,

పైతొక్క మ‌రియు గింజ‌లు తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో జామపండు ముక్క‌లు వేసి జ్యూసీ జ్యూసీలా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌లో బీస్‌వ్యాక్ తీసుకుని మైక్రోవేవ్ సాయంతో వేడి చేసుకోవాలి.

How To Make Body Lotion With Guava Details Body Lotion With Guava, Body Lotion,

ఆ త‌ర్వాత ఇందులో ఐదారు స్పూన్లు ఆలివ్ ఆయిల్‌, త‌యారు చేసుకుని పెట్టుకున్న జామ పేస్ట్ వేసి బాగా క‌లిపి మ‌రోసారి హీట్ చేసుకుంటే బాడీ లోష‌న్ సిద్ధ‌మైన‌ట్టే.ఈ లోష‌న్‌ను చ‌ల్లార్చుకుని.ఆపై గాలి చొర‌బ‌డ‌ని ఒక డ‌బ్బాలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఈ బాడీ లోష‌న్ దాదాపు ఆరు వారాల వ‌ర‌కు నిల్వ ఉంటుంది.

How To Make Body Lotion With Guava Details Body Lotion With Guava, Body Lotion,
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక ఈ బాడీ లోష‌న్‌ను రోజూ వాడితే గ‌నుక డ్రై స్కిన్ స‌మ‌స్యే ద‌రి చేర‌దు.చ‌ర్మం ఎప్పుడూ తేమ‌గా, మృదువుగా మెరిసి పోతుంటుంది.చ‌ర్మంపై ఏవైనా న‌లుపు, తెలుపు మ‌చ్చ‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Advertisement

మ‌రియు స్కిన్ టోన్ సైతం మెరుగ్గా మారుతుంది.

తాజా వార్తలు