ఇంట్లో ఉండే ఈ రెండు ప‌దార్థాల‌తో క్లియ‌ర్ స్కిన్ పొందొచ్చు..తెలుసా?

అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు, క్లియ‌ర్ స్కిన్ పొందేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల క్రీమ్స్‌, సీర‌మ్స్‌, లోష‌న్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్స్ వాడుతుంటారు.ఎన్నెన్నో ఫేస్ మాస్క్‌లు, ప్యాకులు వేసుకుంటారు.

ఈ క్ర‌మంలోనే చ‌ర్మం కోసం ప్ర‌తి నెలా వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.కానీ, పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే రెండు ప‌దార్థాల‌తో క్లియ‌ర్ స్కిన్ పొందొచ్చు.

మ‌రియు సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెండు ప‌దార్థాలు ఏంటో.

వాటిని చ‌ర్మానికి ఎలా వాడాలో తెలుసుకుందాం ప‌దండీ.పెసలు, క‌ల‌బంద‌.

Advertisement

దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఇవి ఉంటాయి.ఈ రెండిటినీ ఉప‌యోగించే అంద‌మైన‌, ప్ర‌కాశ‌వంత‌మైన చ‌ర్మాన్ని పొందొచ్చు.

అదెలాగో చూసేయండి.ముందుగా ఒక క‌ప్పు పొట్టు పెస‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పొడిలా చేసుకోవాలి.

ఈ పొడిని ఒక డ‌బ్బాలో నింపి స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక క‌ల‌బంద ఆకును తీసుకుని పీల్ తొల‌గించి లోప‌ల ఉన్న జెల్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఈ జెల్‌ను బ్లెండ‌ర్‌లో మెత్త‌గా చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెస‌ర పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ క‌ల‌బంద జెల్ వేసుకుని రెండూ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఈ మిశ్ర‌మాన్ని నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి ఉద‌యాన్నే వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

Advertisement

దీనితో పాటు మీరు చేయాల్సిన మ‌రొక ప‌ని ఏంటంటే.హాఫ్ గ్లాస్ వాట‌ర్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ పెస‌రి పిండి వేసి షేక్ చేస్తే ఫేషియ‌ల్ టోన‌ర్ సిద్ధం అవుతుంది.దీనిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి రోజుకు క‌నీసం రెండు, మూడు సార్లు ముఖానికి స్ప్రే చేసుకోవాలి.

అంతే ఈ రెండు స్టెప్స్‌ను ఫాలో అయితే చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు, ముడ‌త‌లు అన్నీ పోతాయి.క్లియ‌ర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మ‌రియు ముఖం ఎల్ల‌ప్పుడూ గ్లోయింగ్‌గా కూడా మెరుస్తుంది.

తాజా వార్తలు