స్మార్ట్ ఫోన్ లో వైరస్ ఉందో లేదో ఇలా తెలుసుకోండి..!

స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ లేదా స్లో అయితే ఎంత చిరాకుగా ఉంటుందో మొబైల్ ఉపయోగించేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలా అవ్వడానికి కారణం స్మార్ట్ ఫోన్ లో వైరస్( Virus ) చేరడం వల్లే.

కొంతమంది ఫోన్ హ్యాంగ్ లేదా స్లో అయితే రీసెట్ చేస్తుంటారు.రీసెట్ చేస్తే మొబైల్ లో ఉండే డేటా మొత్తం తొలగిపోయి కొత్త మొబైల్ ని కొనుగోలు చేసినప్పుడు ఎలా వస్తుందో అలా అవుతుంది.

అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ లో( Smart Phone ) ఉండే థర్డ్ పార్టీ యాప్స్ అన్ని కూడా తొలగిపోతాయి.ఈ పద్ధతి మంచిదే కానీ ఫోన్లో మాత్రం అత్యవసర డేటా కూడా తొలగించాల్సి వస్తుంది.

మరొక పద్ధతి ఏమిటంటే.ముందుగా స్మార్ట్ ఫోన్ లో వైరస్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలి.అంటే కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి థర్డ్ పార్టీ యాప్స్( Third Party Apps ) డౌన్లోడ్ చేసి ఆ తర్వాత వాటిని డిలీట్ చేయడం మరచిపోతుంటాము.

Advertisement

ఆ యాప్స్ వల్ల మొబైల్లో యాడ్స్( Mobile Ads ) వస్తూ ఉంటాయట.మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఏ యాప్ లో ఏం ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి.

అవసరం లేని డేటాతో పాటు అవసరం లేని యాప్స్ ను డిలీట్ చేయాలి.ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే అనుమతులు ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి.

థర్డ్ పార్టీలకు చెందిన వైరస్, మాల్వేర్ యాప్స్ ప్రధానంగా గుర్తించాలి.స్మార్ట్ ఫోన్లలో వచ్చే అనవసర లింకులపై క్లిక్ చేయకూడదు.ఒకవేళ పొరపాటున ఏదైనా లింక్ క్లిక్ చేసినట్లయితే వాటిని ఫోన్లో నుంచి డిలీట్ చేయాలి.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్( Google Play Protect ) స్కాన్ సహాయంతో స్మార్ట్ ఫోన్ లో వైరస్ లేదా మాల్వేర్ ను గుర్తించాలి.ఇది ఆండ్రాయిడ్ అంతర్గత భద్రతకు సంబంధించి ఉంటుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

సురక్షితమైన మోడ్ లో ఉంచి మొబైల్ ఆపరేటింగ్ సిస్టం లో ఎటువంటి అనవసర తప్పులు లేకుండా చూసుకోవాలి.స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఖాళీ సమయాలలో స్మార్ట్ ఫోన్లో ఈ విషయాలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.

Advertisement

ఫోన్ హ్యాంగ్ లేదా స్లో అవడం జరిగే అవకాశం ఉండదు.

తాజా వార్తలు