నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారు..!

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో తొమ్మిదిరోజులపాటు దుర్గా దేవికి వివిధ రూపాలలో అలంకరించి పూజ చేసి వివిధ రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఇకపోతే నవరాత్రి మొదటి రోజులో భాగంగా.

How To Do Navaratri 2021 First Day Puja To Maa Durga, Navratri, Devi Navratri, D

అమ్మవారు శైలపుత్రి దర్శనమివ్వనున్నారు.మరి నేడు అమ్మవారికి పూజ ఎలా చేయాలి పూజ ఏ సమయంలో అమ్మవారికి ఏ రంగు వస్త్రాలను సమర్పించాలి? ఏ విధమైనటువంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయానికి వస్తే.నవరాత్రిలో భాగంగా మొదటిరోజు అమ్మవారిని శైల పుత్రిగా పూజిస్తాము.

ఈరోజు అమ్మవారికి మల్లెపూలు విరజాజి పువ్వులతో పూజ చేయడం ఎంతో మంచిది.నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని రెండేళ్ల చిన్నారిగా భావించి పూజిస్తాము.

Advertisement

ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ నైవేద్యంలో మనం వాడే మిరియాలు భూత ప్రేత పిశాచాలను పారద్రోలడానికి సహకరిస్తాయి.

ఈ రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజ చేయడంవల్ల శత్రువు, బాధలు తొలగిపోయి సంపద అభివృద్ధి చెందుతుంది.మొదటి రోజు అమ్మవారిని పూజించడానికి అనువైన సమయం ఉదయం10.30–12.00 వరకు.సాయంత్రం 6.00 –7.30 వరకు ఎంతో అనువైన సమయం.అయితే అమ్మవారికి తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండుసార్లు దీపారాధన చేయాలి.

కలశం ముందు అఖండ దీపం వెలిగిస్తే ఆ దీపం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆరి పోకుండా చూసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు