రెండేళ్లుగా సక్సెస్‌ లేకున్నా 2 కోట్లు ఎలా ఇస్తున్నారు?

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు లేక ఢీలా పడిపోయింది.అంతుకు ముందు ఈ అమ్మడు టాలీవుడ్‌లోనే మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.

 How They Are Offering 2 Crores For Rakul Preet-TeluguStop.com

టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కు లైఫ్‌ స్పాన్‌ తక్కువ అని రకుల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం స్టార్‌ హీరోయిన్స్‌గా ఉంటారు, రకుల్‌ ఆ కొద్ది మందిలో లేదు అంటూ అంతా అనుకున్నారు.

అయితే రకుల్‌ తనకు రెండు సంవత్సరాలుగా ఆఫర్లు లేకున్నా కూడా తాను ఇంకా స్టార్‌ హీరోయిన్‌ అంటూ నిరూపించుకుంటుంది.తన పారితోషికం ద్వారా ఆమె స్టార్‌ హీరోయిన్‌గా చెప్పకనే చెబుతోంది.

నాగార్జునకు జోడీగా ‘మన్మధుడు 2’ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది.లో బడ్జెట్‌లో నాగార్జున నిర్మించబోతున్న ఈ చిత్రంకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అంత పారితోషికం ఇస్తున్నారా అనేది అనుమానమే.

ఎందుకంటే అసలే సక్సెస్‌లు లేని రకుల్‌కు అంత పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదు.ఆమెకు కోటి రూపాయలు ఇచ్చినా అదే ఎక్కువగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటిది 25 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాకు హీరోయిన్‌ పారితోషికం రెండు కోట్లు ఏంటీ అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

రకుల్‌ సన్నిహితుల ద్వారా తన పారితోషికంను లీక్‌ చేయించినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.పెద్ద మొత్తంలో ఆమె పారితోషికం తీసుకుంటుంది, ఇంకా ఆమె ఫుల్‌ డిమాండ్‌ను క్రేజ్‌ను కలిగి ఉందని అనుకునేలా ప్లాన్‌ అయ్యి ఉంటుంది.కాని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేసిన ప్రయత్నం అంతా కూడా అవాక్కయ్యేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube