ఇప్పటికే నటి శ్రీవిద్య ( Actress Srividya ) గురించి అనేక రకాలుగా అనేక విషయాలు మనం చర్చించుకున్నాం.బ్రతికి ఉన్నంతకాలం ఆమె పడిన ఆవేదన అలాగే ఆస్తులు ప్రేమ పెళ్లి వ్యవహారాల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు.
జీవితాంతం ఎన్నో ఆవేదనలకు గురైన శ్రీవిద్య చివరి క్షేమంగా కూడా అవమానాల పాలయ్యింది.అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.
మరి ఆమె చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి ఆమెను అంతగా అవమానించిన వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నటి శ్రీవిద్య జార్జ్ థామస్( George Thomas ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు.కేవలం ఆమె ఆస్తి కోసమే జార్జ్ శ్రీవిద్య పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కూడా కనకుండా మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు.
దాంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది.ఆ తర్వాత కొన్ని రోజులకు క్యాన్సర్ అవుతుందనే విషయం కూడా తెలిసింది.అయితే విడాకుల కోసం ప్రయత్నించిన శ్రీవిద్యకు అది సాధ్యం కాలేదు.చాలా ఏళ్లపాటు ఆమె విడాకుల కోసం కోర్టులో పోరాటం చేయాల్సి వచ్చింది.
దానికి కారణం అతడు ఒక సిరియన్ క్రిస్టియన్ కావడమే.
ఆ తర్వాత విడాకులు పొందింది కానీ ఎవరిని వివాహం చేసుకోలేదు చివరికి జీవితం చరమాంకల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఆమెను ఆస్తి కోసమే వాడుకున్నారు కుటుంబం కూడా దూరంగానే ఉండేది అయితే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చెన్నైలోనే చేయాలని భావించిన ఆమె భర్త క్రిస్టియన్( Christian ) కావడంతో బ్రాహ్మణులు అంతా కూడా దానిని వ్యతిరేకించారు ఆమెకు అంత్యక్రియలు చేయడానికి వారు పూనుకోలేదు.ఓవైపు క్రిస్టియన్స్ ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి మా పద్ధతిలో ఖననం చేయడం కుదరదు అంటూ తెలిశారు.దాంతో వేరే అత్యంతరం లేక కేవలం శ్రీవిద్య అన్న మాత్రమే అన్ని కష్టాలకు ఓర్చుకొని అంత్యక్రియలు నిర్వహించాడు.
అలా చనిపోయి శవం అయిన తర్వాత కూడా ఆమె అవమానాలకు గురవడం అప్పట్లో సౌత్ ఇండియా మొత్తం లోని ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేసింది.