దేవదాసు, మాయాబజార్, మూగమనసులు, గుండమ్మ కథ వంటి సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శన కనబరిచి మహానటిగా పేరు తెచ్చుకుంది సావిత్రి.( Savitri ) 1934, డిసెంబర్ 6న చిరవూరులో సావిత్రి జన్మించింది.47 సంవత్సరాలకే ఆమె మరణించింది.నేడు ఆమె 89వ జయంతి, కాబట్టి ఈ సందర్భంగా ఆమె పెళ్లి జీవితంలో చోటు చేసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం.
సావిత్రి ఆల్రెడీ వేరే మహిళను పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరో జెమినీ గణేషన్‌ను( Gemini Ganesan ) ఏరి కోరి చేసుకుంది.ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అప్పట్లో సావిత్రి కి పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చినా ఆమె మాత్రం మొండి పట్టుదలతో అతడినే పెళ్లి చేసుకుంది.
గణేషన్ సావిత్రిని తన ప్రేమలో నిలువునా ముంచేసి చివరికి ఆమె మెడలో తాళి కట్టగలిగాడు.నిజానికి సావిత్రికి అప్పట్లో ఏది మంచి? ఏది చెడు? అని ఆలోచించగలిగే వయస్సు లేదు.కొంతమంది ప్రకారం సావిత్రి కి పెళ్లి( Savitri Marriage ) సమయానికి కేవలం 18 ఏళ్ళ ఉన్నాయట.అయితే అఫీషియల్ సోర్సెస్ ప్రకారం సావిత్రి 29 ఏళ్లకు పెళ్లి చేసుకుంది.
అయితే ఎవరికీ తెలియని తెలియకుండా ఆమె 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుందని కొందరు అంటుంటారు.
సావిత్రి, జెమినీ గణేషన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలిసినవారు చెబుతుంటారు.కొన్నేళ్ల తర్వాత ఆ పెళ్లి గురించి బయటకు తెలియడం, అది టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారడం చకచకా జరిగిపోయాయి.అయితే వీరి మధ్య జరిగిన పెళ్లి విషయాన్ని ఎవరు బయటపెట్టారు? అనేది ఇప్పటిదాకా తెలియ రాలేదు.సావిత్రి, జెమినీ గణేషన్ అప్పట్లో ఒకరికొకరు రాసుకున్న లవ్ లెటర్స్( Love Letters ) బయటపడ్డాయి.దానివల్ల వీరి పెళ్లి కూడా చివరికి వెలుగులోకి వచ్చింది.ఇండస్ట్రీలోని కొందరు కూడా వీరి పెళ్లి గురించి బయటకు లీక్ చేశారు.
ఈ జంట మ్యారేజ్ చేసుకున్న సంగతి బయట పడడానికి మరొక కారణం కూడా ఉందని చెబుతారు.అదేంటంటే, సావిత్రి ఒక ఇంటర్నేషనల్ సోప్ కంపెనీకి అంబాసిడర్‌గా సంతకం చేసేటప్పుడు సావిత్రి గణేషన్( Savitri Ganesan ) అని రాసింది.దాంతో ఆమె అతడిని పెళ్లి చేసుకుందన్న సంగతి బయటకు వచ్చింది.
ఈ పెళ్లి అనంతరం సావిత్రి చాలా సఫర్ అయ్యింది.మహానటి సినిమాలో( Mahanati ) చూపించిన విధంగా ఆమె చివరికి చాలా దయనీయ పరిస్థితులలో చనిపోయింది.
ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.వారిలో పెద్దమ్మాయి పేరు విజయ చాముండేశ్వరి, చిన్న కొడుకు పేరు సతీష్ కుమార్.