బెజవాడ వైసీపీ రాజకీయం చకచకా మారుతోంది.ఆ పార్టీ గత ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు తూర్పు సీటును కోల్పోవడం, సెంట్రల్ సీటును కేవలం 25 ఓట్లతో గెలుచుకోవడం జగన్‌కు రుచించలేదు.
ఇక రాజధాని మార్పు ప్రభావం కూడా నగరంపై గట్టిగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠం దక్కించుకోవడంతో పాటు కృష్ణా జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాదు ఇంకా చెప్పాలంటే స్వీప్ చేసి వైసీపీ సత్తా ఏంటో చాటాలని జగన్ కంకణం కట్టుకున్నారు.ఇందుకోసం అనేక ఈక్వేషన్లు అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన యువనేత, పార్టీ తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌కు జగన్ ఎంతో ప్రయార్టీ ఇస్తున్నారు.తూర్పు నియోజకవర్గ పగ్గాలతో పాటు అవినాష్ కోరినట్టు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం… సామాజిక వర్గ పరంగా కూడా అవినాష్ వర్గానికి కోరిన పదవులు ఇవ్వడంతో పాటు అవినాష్ క్రమశిక్షణ, కష్టం గురించిన జగన్ అవినాష్‌కు పార్టీలో మరో కీలక పదవి అప్పగించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అనతి కాలంలోనే తూర్పులో వైసీపీ దూకుడు.

గత ఎన్నికల్లో ఇంత భారీ వేవ్‌లో కూడా తూర్పులో వైసీపీ ఓడిపోయింది.ఆ వెంటనే అవినాష్ వైసీపీలోకి రావడం.తూర్పు ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించడం చకచకా జరిగిపోయాయి.
వెనక్కు తిరిగి చూస్తే ఆరు నెలల్లోనే తూర్పులో వైసీపీ ఫుల్ స్వింగ్‌లో దూసుకు పోతోంది.త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్లో తూర్పులోనే వైసీపీ మెజార్టీ కార్పొరేటర్ సీట్ల్ దక్కించుకోనుంది.
ఇక రాజధాని తరలింపు నేపథ్యంలో విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో కొంత వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్న నివేదికలు కూడా ఇప్పటికే జగన్ చెంతకు వెళ్లిపోయాయి.
ఈ క్రమంలోనే జగన్ అవినాష్‌పై మరింత పెద్ద బాధ్యత పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఆ పెద్ద బాధ్యత ఏదో కాదు విజయవాడ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించడం.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంటరీ పార్టీ పగ్గాలను కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలని జగన్ కొద్ది రోజులుగా భావిస్తున్నా… అందుకు సరైన క్యాండెట్ లేకపోవడం.
ఈక్వేషన్లు సెట్ కాకపోవడంతో జగన్ ఈ పదవి ఎవ్వరికి ఇవ్వలేదు.ఇక అవినాష్‌పై స్వల్ప కాలంలోనే గురి కుదరడంతో ఈ పదవి అవినాష్‌కు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నారని.త్వరలోనే అవినాష్ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది.