తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండోవ తరం హీరోగా నాగార్జున( Nagarjuna ) ఎంట్రీ ఇచ్చాడు.ఇక చాలా తక్కువ టైం లోనే మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక తెలుగులో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను అందుకున్నాడు.అయితే తెలుగు డైరెక్టర్లు మాత్రం నాగార్జునకి సూపర్ డూపర్ సక్సెస్ లు ఇచ్చి ఆయన క్రేజ్ ను పెంచితే, పరభాష దర్శకులు మాత్రం ఆయనకు భారీ ఫ్లాప్ లను ఇచ్చారనే చెప్పాలి.
క్రిమినల్
ఇక నాగార్జున బాలీవుడ్ డైరెక్టర్ అయిన మహేష్ బట్( Mahesh Butt ) డైరెక్షన్ లో క్రిమినల్( Criminal ) అనే సినిమా చేశాడు.ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయింది.
ఇక దీనితో నాగార్జునకు అప్పటి వరకు ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిందనే చెప్పాలి.

కిల్లర్
ఇక కిల్లర్ ( Killer )సినిమాకి ముందు నాగార్జున మంచి విజయాలను అందుకొని సక్సెస్ బాట లో ఉన్నాడు.ఇక ఎప్పుడైతే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఫాజిల్( Fazil ) డైరెక్షన్ లో కిల్లర్ సినిమా చేశాడో అప్పటినుంచి నాగార్జున కెరియర్ అనేది డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది.ఇక ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోగా నాగార్జున కి ఏ రకంగానూ హెల్ప్ అవ్వలేదు.

రక్షకుడు
భారీ అంచనాలతో వచ్చిన రక్షకుడు సినిమా( Rakshakkudu movie ) భారీ డిజాస్టర్ గా మిగిలింది.ఇక పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ అవడంతో నాగార్జున కి భారీ దెబ్బ తగిలింది.ఈ సినిమాని తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రవీణ్ గాంధీ( Praveen Gandhi ) డైరెక్షన్ చేయడం విశేషం.

నిర్ణయం
మలయాళ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రియదర్శన్( Priyadarshan ) దర్శకత్వంలో వచ్చిన నిర్ణయం సినిమా( nirnayam ) అల్ట్రా డిజాస్టర్ గా మిగిలింది.ఇక ఈ సినిమాతో నాగార్జున కి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాలతో నాగార్జున పరభాష దర్శకుల సినిమాలు చేయాలంటే ఆచితూచి ముందుకు అడిగేస్తున్నాడు…