అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం వచ్చి సంవత్సరం కావస్తుంది.కాని ఇంకా తదుపరి చిత్రంను మొదలు పెట్టలేదు.
నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్‌తో కాస్త ఆచితూచి కథను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదు.కాని సంవత్సరం పాటు పూర్తి కాళీగా ఉండటం ఏంటీ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరు నెలల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మూవీ అంటూ అధికారికంగా క్లారిటీ వచ్చింది.అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభంకు కూడా అదుగో ఇదుగో అంటూ కాలయాపన జరుగుతుంది.
గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ బర్త్‌డే సందర్బంగా మార్చి 27న సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాతలు అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఆ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు మౌనంగా ఉండటంతో ఆ వార్తలు నిజమే అయ్యి ఉంటాయని అంతా భావించారు.కాని అనూహ్యంగా చరణ్ బర్త్‌డే రోజున కూడా సినిమా ప్రారంభం కాలేదు.
తాపీగా ఆ తర్వాత రోజు అంటే నేడు సినిమా ప్రారంభంకు ఇంకాస్త సమయం కావాలి, వెయిట్ చేయండి అంటూ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ చాలా రోజుల క్రితమే మంచి కథను సిద్దం చేశాడట.అయితే ఆ కథ మెగా వర్గాల వారికి నచ్చక పోవడంతో చేసేది లేక కొత్త కథలను చూస్తున్నాడు.మూడు నాలుగు కొత్త లైన్స్‌కు ఓకే చెప్పిన మెగా హీరో వాటిల్లోంచి ఒకదాన్ని ఇంకా సెలక్ట్ చేయలేదని, అందుకు సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
అంటే సినిమా ప్రారంభంకు ఇంకా ఎంత లేదైనా రెండు మూడు నెలలు అయినా పడుతుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని బన్నీని ఫ్యాన్స్ సున్నితంగా హెచ్చరిస్తున్నారు.