తమిళనాట చాలామంది దర్శకులు ఉన్నారు కానీ అందులో వినిపించే పేర్ల విషయానికొస్తే చాలా తక్కువే ఉంటాయి మొదట్లో బాలచందర్ భారతి రాజా బాలు మహేంద్ర లాంటి వారి పేర్లు గట్టిగా వినిపించేవి ఆ తర్వాత అదే స్థాయిలో వినిపించిన పేరు బాల పూర్తి పేరు బాలసుబ్రమణ్యం.బాల సినిమా వచ్చింది అంటే రికార్డులు వస్తాయని అందరూ అనుకుంటారు కానీ ఆయన తీసిన మొదటి సినిమా విడుదలవ్వడానికి పురిటి నొప్పులు పడంత అవస్థ పడ్డాడు ఆ సినిమా విడుదల అవ్వడానికి మొదలవ్వడానికి విడుదలవ్వడానికి బాల పడ్డ కష్టాలు వింటే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేము.ఆ సినిమా సేతు… తెలుగులో కూడా విడుదలైంది.తెలుగులో తప్ప భారత దేశంలోని అన్ని భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది.

నిజానికి బాలా చిన్నతనం కూడా ఎంతో కష్టంగానే సాగింది.అతడు తీసే సినిమాల్లో హీరోలు ఎంతగా అబ్నార్మల్ గా కనిపిస్తారో అతడు వ్యక్తిగతంగా కూడా అంతే అబ్ నార్మల్ గా ఉంటాడు.8 ఏళ్ల వయసులోనే తన తల్లి పెంచలేక మేనత్తకు దత్తత ఇవ్వడంతో సొంత తల్లి పైనే ఎంతో కోపాన్ని పెంచుకున్నాడు బాల.తన తల్లి తనను వదిలేసింది అని బాగా నాటుకు పోయింది అతని మనసులో.తాను తీసే సినిమాలు క్యారెక్టర్లలో దాని తాలూకా ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది.అలాగే చదువుకున్న వయసులోనే చెడు అలవాట్లు చేసుకున్నాడు ఇంటర్లోనే గంజాయి కి బానిస అయ్యాడు.
అసలు ఏం అవ్వాలో ఒక క్లారిటీ లేకుండా డిగ్రీ లోనే దారి తప్పిన ఓ బక్కపలచని కుర్రాడే బాల.

తాను ఇటీవల రాసిన ఆ వీడియో బాల చాలా సక్సెస్ఫుల్ గా అమ్ముడు అవుతుంది.ఈ పుస్తకంలో తన జీవితంలోని ఎన్నో సంఘటనలను పూర్తిగా వివరించాడు.నిజానికి బాల చాలా మొండివాడు అంతే మూర్ఖుడు కూడా ఎవరు చెప్పినా వినే అలవాటు లేదు.
తనకు తానే ఒక అనితర సాధ్యమని చెప్పుకుంటూ ఉంటాడు.పైగా ప్రేక్షకులను తన శాడిజంతో బాధించడమే తన లక్ష్యం అన్నట్టు గర్వంగా చెప్పుకుంటాడు.
ఇక తన తాను ఎవరి దగ్గర అయితే దర్శకత్వం ఎలా చేయాలో నేర్చుకున్నాడో ఆ గురువు ఇప్పటివరకు బాలా తీసిన ఒక్క సినిమా కూడా చూడలేదట.







