Umair Sandhu : ఉమైర్ సంధు ఓవర్ యాక్షన్.. బన్నీ రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ పోస్ట్.. చివరికి?

ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు( Umair Sandhu ) గురించి మనందరికీ తెలిసిందే.దేశవ్యాప్తంగా ఉన్న టాప్స్ సినీ విశ్లేషకులలో ఉమైర్ సంధు కూడా ఒకరు.

సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు మధ్య ఉన్నవి లేనివి సృష్టిస్తూ లింకులు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.హీరో హీరోయిన్లు కాస్త చనువుగా కనిపించారు అంటే చాలు వారి మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు ట్వీట్ లు చేస్తూ వివాదాలకు తెర లేపుతూ ఉంటాడు.

తరచూ ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన సంచలన ట్వీట్ చేస్తూ ఉంటాడు.

ఇప్పటికే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్లు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఉమైర్ సంధు అల్లు అర్జున్, రష్మిక ( Allu Arjun, Rashmika )లను టార్గెట్ చేశాడు.వీరిద్దరిని ఉద్దేశించి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన ట్వీట్ చేశాడు.

Advertisement

అల్లు అర్జున్ రష్మిక మందన ప్రైవేట్ ప్లేన్ లో టైం స్పెండ్ చేస్తున్నారు.బన్నీ వైఫ్ కి ఈ విషయం తెలిసిన ఆమె దీన్ని పట్టించుకోలేదు.అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ఇక అల్లు అర్జున్ రష్మికతో పాటు ఆ ఫోటోలో దేవిశ్రీప్రసాద్( Devi Sri Prasad ) కూడా ఉన్నారు.తాజాగా ట్వీట్ చూసిన అల్లు అర్జున్ రష్మిక మందన అభిమానులు మండిపడుతున్నారు.

ఉమైర్ సంధు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా కేవలం బన్నీ,రష్మిక మందన విషయంలోనే కాకుండా గతంలో ఎంతో మంది సెలబ్రిటీల మధ్య ఈ విధంగానే ఎఫైర్లు నడుస్తున్నాయి అంటూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.కొన్ని కొన్ని సార్లు అతను పెట్టే ట్వీట్ లు చూస్తే అది ట్విట్టర్ అకౌంట్ లేకపోతే టాయిలెట్ కమోడా అనేంతలా అరాచకంగా ట్వీట్ చేస్తూ ఉంటాడు.ఇక ఈ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్స్ ఉమైర్ సంధు ఓవర్ యాక్షన్ కాకపోతే రష్మిక బన్నీ రిలేషన్ లో ఉండడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఇకపోతే అల్లు అర్జున్ రష్మిక మందన విషయానికి వస్తే ప్రస్తుతం వీరిద్దరూ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు